RRR: ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకు వచ్చింది రాజమౌళి.. ఎన్టీఆర్ వైరల్ కామెంట్స్..!!

Share

RRR: రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో “RRR” లో ఫస్ట్ టైం చరణ్(Charan) తో ఎన్టీఆర్(NTR) చేయటం తెలిసిందే. బాహుబలి(Bahubali) తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఒక టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. జనవరి 7వ తారీకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే చాలా చోట్ల సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు.

Jr NTR calls Rajamouli a 'taskmaster'

ఇక ఇదే క్రమంలో వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. ఇంటర్వ్యూలో ఇద్దరు హీరోలు చరణ్, ఎన్టీఆర్ ఒకరిని మరొకరు పొగుడుకుంటూ మరోపక్క డైరెక్టర్ రాజమౌళి పనితనాన్ని వివరిస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తూ కొత్తకొత్త విషయాలు తెలియ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చాలా డిప్రెషన్.. మానసికంగా ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న టైంలో రాజమౌళి చేసిన హెల్ప్ గురించి కొత్త విషయం బయట పెట్టాడు.

SS Rajamouli reveals if he'll reunite with Jr NTR, Ram Charan for  Mahabharata - Hindustan Times

విషయంలోకి వెళితే 18 సంవత్సరాలకి హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ట్లు రెండో సినిమాకే స్టార్ డామ్ చూసినట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు ఫ్లాప్ కావటంతో చాలా డిప్రెషన్లోకి వెళ్లి పోయాను అని చెప్పుకొచ్చారు. ఆ టైంలో మానసికంగా అనేక ఇబ్బందులు ఒత్తిడికి గురయ్యా… అసలే ఆ సమయంలో ఏ పని చేయలేక పోయాను, చాలా కష్ట సమయాన్ని ఆ టైంలో అనుభవించాను… ఇంకా పూర్తిగా డిప్రెషన్లో నిండా.. మునిగి పోయిన సమయంలో తనను బయటకు తీసుకు వచ్చింది డైరెక్టర్ రాజమౌళి అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అటువంటి కష్టకాలంలో వెన్నంటే ఉండి నాలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ పోయేలా.. జక్కన్న చొరవ తీసుకున్నాడని.. తనని మంచి నటుడిగా తీర్చిదిద్దింది రాజమౌళినే అని ఎన్టీఆర్ స్పష్టం చేశారు.


Share

Related posts

తలతిక్క డబ్బు లెక్కలేంటి బిగ్ బాస్..!? ఎవరికి అన్యాయం జరిగినట్టు..!?

Muraliak

Amritha Aiyer Latest Wallpapers

Gallery Desk

7Days 6Nights: 7డేస్ 6 నైట్స్ కథ చెప్తానంటున్న ఎం.ఎస్.రాజు..!!

bharani jella