సినిమా

RRR: థియేటర్ నుండి వెళ్లిపోయే టైం లో కూడా రికార్డ్ క్రియేట్ చేసిన “ఆర్ఆర్ఆర్”..!!

Share

RRR: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” భారీ అంచనాల మధ్య విడుదలై ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేయడం తెలిసిందే. ఎన్టీఆర్- చరణ్ ఫస్ట్ టైం నటించిన ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయ్యి అన్నిచోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ లను షేక్ చేసి పడేసింది. బాలీవుడ్ మొదలుకుని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు అన్ని చోట్ల రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి బాహుబలి 2 ఒక్క స్థాయిలోకి తీసుకెళ్తే “RRR” మరో మెట్టు పైకి ఎక్కించింది. భాషలు మరియు దేశాలు ప్రాంతాలకతీతంగా “RRR” అందరి ప్రశంసలను అందుకోవడం జరిగింది.

RRR also created a record at the time of leaving the theater

ఇదిలా ఉంటే త్వరలో ఈ సినిమా ఓటిటి లో విడుదల కానున్న సంగతి తెలుసు. జీ5 ఓటిటి లో మే 20వ తారీకు నుండి స్ట్రీమింగ్ కానుంది. దీంతో సినిమా థియేటర్ నుండి వెళ్లి పోయే పరిస్థితి నెలకొన్న సమయంలో కూడా “RRR” సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. మేటర్ లోకి వెల్తే దాదాపు 500 సెంటర్లలో 50 రోజులు “RRR” పూర్తి చేసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా 50 రోజులు 500 సెంటర్లలో ప్రదర్శించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నందమూరి మెగా అభిమానులు సుదర్శన్ థియేటర్ 35MM లో 50 రోజుల వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు.

 

దేశంలో “బాహుబలి 2” తర్వాత రికార్డులు చాలావరకు “RRR” పైనే ఉన్నాయి. బాహుబలి తో తన సత్తా ఏంటో నిరూపించిన రాజమౌళి “RRR” నీ కూడా ఆ రీతిగా చెక్కడంతో… అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాని ఆదరించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళికి తిరుగులేదని..”RRR” చూసిన తర్వాత సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు రియాక్ట్ అయ్యారు. సో మొత్తం మీద థియేటర్ నుండి వెళ్లి పోయే సమయంలో కూడా “RRR” రికార్డ్ క్రియేట్ చేయడం తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.


Share

Related posts

Varun tej : వరుణ్ తేజ్ గని సినిమా మీద భారీ అంచనాలు…టార్గెట్ ఆ సినిమానే ..?

GRK

Chiranjeevi : చిరంజీవి – వెంకటేష్ – బాలకృష్ణ .. ఎవరి సత్తా ఏంతో తేలబోతోంది ..?

GRK

జనతా గ్యారేజ్ విలన్ ఉన్ని కొన్న బైక్ ఏమిటో తెలుసా .! దాని ధర తెలిస్తే షాక్ అవ్వలిసిందే..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar