RRR: ఆర్ఆర్ఆర్..రిలీజ్ సమయం దగ్గర పడుతున్నా కొద్దీ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో నరాలు తెగిపడే ఉత్కంఠత పెరిగిపోతోంది. బాహుబలి సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇంత ఉత్కంఠ వాతావరణం నెలకొనలేదనే చెప్పాలి. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన ఇప్పుడు ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా అత్యంత భారీ స్థాయిలో ‘ ఆర్ఆర్ఆర్’ సినిమా ని ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తున్నారు. మెగా – నందమూరి అభిమానులు, యావత్ సినీ ప్రేమికులు ఈ భారీ మల్టీస్టారర్ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు
చూస్తున్నారు.
అయితే, ఈ సినిమా మన తెలుగు సినిమా ఏదీ కూడా ఇప్పటి వరకు ఇతర దేశాలలో రిలీజ్ కానంత భారీ స్థాయిలో మొదటి సారి రిలీజ్ అవుతుండటం విశేషం. ఇప్పటికే అమెరికాలో చరణ్, తారక్ అభిమానుల సందడి తారా స్థాయిలో ఉంది. తమ అభిమాన హీరోలు నటించిన ఈ మల్టీస్టారర్ సినిమాను తామే భుజాన వేసుకొని భారీ స్థాయిలో ప్రమోట్ చేసుకుంటున్నారు. నిజంగా ఇంతక ముందు ఏ తెలుగు సినిమాకు యూఎస్ లో ఇలా జరిగింది లేదనే చెప్పాలి.
RRR: సౌత్ సినిమా ఇండస్ట్రీలలోని ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు.
అయితే, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఇన్నేళ్ళల్లో మన సౌత్ భాషల నుంచి ఇంకా చెప్పాలంటే ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కానంత భారీ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమా అక్కడ రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని అక్కడ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ మొత్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్స్ లిస్ట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో మన తెలుగు సినిమాకు ఆస్ట్రేలియాలో ఇంత క్రేజ్ అండ్ రేంజ్ ఉందా అని సౌత్ సినిమా ఇండస్ట్రీలలోని ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు. కాగా, ఇందులో సీతారామరాజుగా చరణ్, కొమురం భీం గా ఎన్.టి.ఆర్ నటించారు. బాలీవుడ్ స్టార్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయ శరణ్, సముద్రఖని, హాలీవుడ్ స్టార్స్ ఓలివియా మోరీస్ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
All set for a Biggest Ever Release for any Indian Film in Australia Region. @Radhakrishnaen9 @MoviesTolly #RRR Final list of theatres!🔥🔥🔥🌊🌊🌊 @RRRMovie @DVVMovies @ssrajamouli @AlwaysRamCharan @tarak9999 @ajaydevgn @aliaa08 @PharsFilm @HoytsNZ @EVENTCinemasNZ pic.twitter.com/gwsL4y25Ex
— Radhakrishnaentertainments (@Radhakrishnaen9) March 23, 2022