RRR: టాలీవుడ్లో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో అలియా భట్, ఒలివియో మోరీస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియా శరణ్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇందులో కీలక ప్రాతలను పోషించగా.. కీరవాణి స్వరాలు అందించారు.
నాలుగేళ్ల క్రితమే మొదలైన ఈ మూవీ కరోనా కారణంగా పడుతూ లేస్తూ ఎలాగోలా షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. చివరాఖరకు మార్చి 25న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది.
మొదటి వారం మొత్తం మీద ఒక్క హాలిడే లేకున్నా కానీ 6 రోజులు నాన్ స్టాప్ రికార్డులు కొట్టిన ఆర్ఆర్ఆర్.. ఏడో రోజు డ్రాప్ అయినా ఎనిమిదో రోజు మళ్లీ పంచుకుని మరో ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసింది. ఇక 9వ రోజు ఉగాది పండగ కావడంతో.. ఈ సినిమా కనివిని ఎరుగని కలెక్షన్స్‌తో సంచలన రికార్డ్ నమోదు చేసింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఏకంగా రూ. 19.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇంతకు ముందు 9వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో బాహుబలి రూ. 6.51 కోట్ల షేర్‌తో అత్యధిక కలెక్షన్స్ వసూల్ చేసిన చిత్రంగా ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది. అయితే ఆ రికార్డును చిత్తు చిత్తు చేయడమే కాదు.. మూడు రెట్లు ఎక్కువ వసూళ్ళతో ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. మరి ముందు ముందు ఆర్ఆర్ఆర్ స్థానాన్ని ఎవరైనా టచ్ చేయగలరా..? లేదా..? అన్నది చూడాలి.