108 ప్రీ-రిలీజ్‌కు వారు

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 118 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నివేద థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ దర్శకుడిగా మారి తెరక్కిస్తున్న చిత్రం ఇది. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో 118పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో 118 గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 118 ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు. ఇప్పటికే ప్రొడ్యూసర్స్ తో డీల్ సెట్ చేసుకున్న దిల్ రాజు 118 ప్రొమోషన్స్ ని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.
ఇందులో భాగంగానే 118 ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని, రాజమౌళిని, రామ్ చరణ్ ని చీఫ్ గెస్టులుగా పిలవాలని డిసైడ్ అయ్యాడట. కళ్యాణ్ రామ్ సినిమా కాబట్టి ఎన్టీఆర్ ఎలాగూ వస్తాడు, అతనితో పాటు జక్కన, చరణ్ కూడా కలిస్తే 118 సినిమాకి అదిరిపోయే రేంజులో పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఇది ఆలోచించే దిల్ రాజు అలా ముగ్గురినీ పిలవాలని ప్లాన్ చేసినట్లున్నాడు.