న్యూస్ సినిమా

RRR glimpse చూసి మహేష్ పవన్ రియాక్షన్ ఇదే..!

Share

RRR Film: అభిమానులు అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం అటు మెగా అభిమానులు ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దీపావళి పండగ నాడు అభిమానులు ఇంకాస్త ఆనందంగా ఉండాలని ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు. అలాగే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాలో కొమరం భీం గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. అలాగే మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

 

గ్లింప్స్‌లో వీరి నటన మాములుగా లేదుగా:

ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్ చూస్తుంటే అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సహాం 100% వస్తుందని చెప్పొచ్చు. మరో రెండు నెలల్లో చిత్రం విడుదల అవుతున్న కారణంగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్‌ ను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమా గ్లింప్స్ ను ఈరోజు ఉదయం 11 గంటలకు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ విజువల్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తాయి అనే చెప్పాలి. తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్‌ నెటిజన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది.

 

పవన్ కళ్యాణ్, మహేష్ రియాక్షన్ ఇదే:

ఈ గ్లింప్స్‌ లో ఎన్టీఆర్, చరణ్ ల మాస్ ఎంట్రీతో పాటు అజయ్ దేవగన్, అలియా లుక్స్ చూస్తుంటే అదిరిపోయాయనే చెప్పాలి. ఈ గ్లింప్స్‌లో విజువల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా టీజర్ చూసి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు రియాక్షన్ మామూలుగానే లేదనే చెప్పాలి. సినిమా గ్లింప్స్‌ చూస్తుంటే చాలా బాగున్నాయని అంటున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విజువల్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. వారితో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్ లు నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.


Share

Related posts

రికార్డ్ స్థాయిలో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా కలెక్షన్స్…! ఎంతో తెలిస్తే వామ్మో అనాల్సిందే..!!

bharani jella

Electric Vehicles : పెట్రోల్ వాహనాలు వద్దు.. ఎలక్ట్రిక్ వాహనాలు ముద్దు..

bharani jella

`ది ఘోస్ట్‌` కోసం ఆ హీరోలిద్ద‌రి సాయం తీసుకుంటున్న నాగ్‌..ఫ్యాన్స్‌కి పండ‌గే!?

kavya N