33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RRR: మరో రెండు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న RRR..!!

Share

RRR: “RRR” హవా ఇంకా నడుస్తూనే ఉంది. గత ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు మాత్రమే కాదు అవార్డుల పరంగా కూడా దూసుకుపోతోంది. ఇండియాలో ఏ సినిమాకి రాని రీతిలో “RRR”కీ పలు అంతర్జాతీయ అవార్డులు రావడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఆస్కార్ అవార్డుల బరిలో కూడా ఉంది. “నాటు నాటు” సాంగ్ కీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలవడం జరిగింది. ఇదే సాంగ్ ఆస్కార్ రేస్ లో కూడా ఉంది. కాగా ఇప్పుడు ఈ సినిమా మరో రెండు అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. విషయంలోకి వెళ్తే హూస్టన్ ఫిలిం క్రిటిక్ సొసైటీ అవార్డులలో ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది.

RRR has won two more international awards

అలాగే నాటు నాటు పాట కూడా మరోసారి అంతర్జాతీయ అవార్డు ఈ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అందించడం జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారం కూడా ఈ సినిమాకే లభించింది. ఈ రకంగా నాటినాటి పాట అంతర్జాతీయ అవార్డుల పరంగా గెలుస్తూ ఉండటంతో కచ్చితంగా ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని సినీ క్రిటిక్స్ చెప్పుకొస్తున్నారు. మార్చి నెలలో ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరుగునుంది. ఈ నేపథ్యంలో “RRR”.. గెలవాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. భారతదేశంలో ఏ సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఈ విధంగా సత్తా చాటు లేదు.

RRR has won two more international awards

దీంతో “RRR”.. సెకండ్ పార్ట్ తీసే ఆలోచనలో రాజమౌళి ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే విదేశీ మీడియాకు తెలియజేశారు. ప్రస్తుతం మహేష్ బాబు ప్రాజెక్టు పై రాజమౌళి వర్క్ చేస్తున్నారు. త్వరలోనే మహేష్ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడు అనగా మే 31 వ తారీకు సెంటిమెంట్ పరంగా రాజమౌళి సినిమా అధికారిక ప్రకటన చేయాలని మహేష్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడు తాను చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించి టీజర్ లేదా వీడియో ఏదో ఒకటి మహేష్ రిలీజ్ చేస్తారు. అయితే ఆయన మరణించాక వస్తున్న మొదటి పుట్టినరోజు నేపథ్యంలో రాజమౌళి సినిమా ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన సెంటిమెంట్ పరంగా చేయాలని మహేష్ డిసైడ్ అయినట్లు సమాచారం.


Share

Related posts

Intinti Gruhalakshmi మరో తులసిలా మారుతున్న దివ్య.. కథ మలుపు తిరుగుతోంది..

bharani jella

Waltair Veerayya OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఎప్పుడంటే..??

sekhar

Dhamaka: “ధమాకా” సక్సెస్ మీట్ లో రవితేజ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన హరీష్ శంకర్..!!

sekhar