“RRR” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరిని ఆశ్చర్యపరిచి సినీ ప్రపంచం చేత శభాష్ అనిపించుకుంది. సినిమా థియేటర్లో మాత్రమే కాదు ఓటీటీలో కూడా అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి హాలీవుడ్ ఇండస్ట్రీ చేత శభాష్ అనిపించుకోంది. “RRR” చూసిన తర్వాత చాలామంది హాలీవుడ్ దర్శకులు హీరోలు చరణ్ మరియు ఎన్టీఆర్ నీ పొగడ్తలతో ముంచెత్తారు.
హాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా సినిమాలు చేయాలని మరి కొంత మంది కోరారు. ఇదంతా పక్కన పెడితే థియేటర్ మరియు ఓటీటీలో మాత్రమే కాదు టెలివిజన్ రంగంలో కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది. “RRR” పాన్ ఇండియా సినిమా అని అందరికీ తెలుసు. చాలా భాషలతో పాటు మలయాళంలో కూడా రిలీజ్ కావడం జరిగింది. ఇది ఇటీవల ఆగస్టు 14 వ తారీకు మలయాళంలో ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం చేయడం జరిగింది.
ఈ క్రమంలో అక్కడ ఏకంగా టిఆర్పి రేటింగ్ విషయంలో గతంలో ఏ సినిమా చేయని రీతిలో..13.70 టిఆర్పి సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. అదే రోజు తెలుగులో కూడా ప్రసారం కాగా 19.62 టిఆర్.పి సాధించడం జరిగింది. ఇది రికార్డు కాకపోయినా కానీ టాప్ టెన్ లో నిలవడం జరిగింది. ఏది ఏమైనా సినిమా ధియేటర్, ఓటీటీ లో మాత్రమే కాదు ఇతర భాషల్లో టెలివిజన్ రంగంలో కూడా “RRR” సరికొత్త రికార్డులు సృష్టించడం విశేషం.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!