RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవగణ్, శ్రియా సరణ్, సముద్రఖని కీలక పాత్రలను పోషించారు. సినీ ప్రియులను గత నాలుగేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ.. చివరాఖరకు నిన్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేశారు.
విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంలో కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌లు తమదైన నటనతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేశారు. రాజమౌళి టేకింగ్, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్, బలమైన భావోద్వేగాలు, కీరవాణి స్వరపరిచిన పాటలు సినిమాకు ఆకర్షణలుగా నిలుస్తాయి.
మొత్తంగా చెప్పాలంటే సినిమా సూపర్ హిట్ అని చెప్పాలి. ఇక టాక్ బాగుండటం వల్ల ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లను రాబడుతూ దుమ్ము దులిపేస్తోంది. ఈ నేపథ్యంలోనే తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 135.00 కోట్ల షేర్, రెండో రోజు రూ. 67.44 కోట్ల షేర్ రాబట్టిన ఈచిత్రం.. మూడో రోజు మరికాస్త పుంచుకుని రూ. 73.72 కోట్ల షేర్ వసూల్ చేసింది. ఏరియాల వారీగా ఆర్ఆర్ఆర్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
నైజాం- రూ. 53.50 కోట్లు
సీడెడ్- రూ. 28.90 కోట్లు
ఉత్తరాంధ్ర- రూ. 15.54 కోట్లు
తూర్పు గోదావరి- రూ. 8.69 కోట్లు
పశ్చిమ గోదావరి- రూ. 7.98 కోట్లు
గుంటూరు- రూ. 11.56 కోట్లు
కృష్ణ- రూ. 8.25 కోట్లు
నెల్లూరు- రూ. 4.82 కోట్లు
————————————–
ఏపీ+తెలంగాణ మొత్తం- రూ.139.27 కోట్లు (రూ.203.10 కోట్లు~ గ్రాస్)
————————————–
కర్ణాటక- రూ.18.50 కోట్లు
తమిళనాడు- రూ. 16.20 కోట్లు
కేరళ- రూ. 5.25 కోట్లు
హిందీ- రూ. 36.80 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- రూ. 4.05 కోట్లు
ఓవర్సీస్- రూ. 56.10 కోట్లు
———————————–
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్= రూ. 276.16 కోట్లు (గ్రాస్- రూ. 491 కోట్లు)
———————————–
కాగా, విడుదలకు ముందుకు ప్రపంచవ్యాప్తంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఇప్పుడీ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు కాకుండా.. ఇంకా రూ. 176.84 కోట్ల షేర్ వసూల్ చేయాల్సి ఉంది.