RRR: “ఆర్ఆర్ఆర్” ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి1 భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” .. మరోసారి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సత్తా ఏంటో రుజువు చేసింది. జక్కన్న టేకింగ్ కి దేశాలతో భాషలతో సంబంధం లేకుండా.. ప్రపంచ సినిమా లవర్స్ ఫిదా అవుతున్న పరిస్థితి. మార్చి 25 వ తారీకు విడుదలైన ఈ సినిమా మొదటి నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. దేశ విదేశాలలో ఇప్పటికే రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు వందల కోట్ల కంటే ఎక్కువ నాలుగు రోజుల్లోనే రావట గా హిందీలో ఏకంగా 150 కోట్ల మార్క్.. ఐదు రోజుల్లోనే దాటినట్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో దాదాపు 600 కోట్లకు పైగా “ఆర్ఆర్ఆర్” కలెక్షన్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు నేపాలి దేశంలో కూడా… వీకెండ్ అయిపోయిన గాని.. మామూలు రోజుల్లో కూడా మోతకించే కలెక్షన్ లు… రావడం అక్కడ చిత్ర వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మామూలుగా అయితే ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్ తగ్గుతుందని అందరూ అనుకున్నారు కానీ దానికి భిన్నంగా మంగళవారం నాడు… భారీ ఎత్తున “ఆర్ఆర్ఆర్” కి కలెక్షన్ లు వచ్చాయట.
రోజుకి కోటి రూపాయల చొప్పున నేపాల్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు నాలుగు కోట్లు కలెక్ట్ చేయగా… వారం రోజులకు ఇదే జోరు కొనసాగితే ఏడు కోట్ల వసూలు రావటం గ్యారెంటీ అని అక్కడ చిత్ర వర్గాలు తెలియజేస్తున్నాయి. బాహుబలి క్రేజ్ తో “ఆర్ఆర్ఆర్” కి నేపాలి సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు..అని అంటున్నారు. ఓవరాల్ గా “ఆర్ఆర్ఆర్” నేపాల్ లో కూడా సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని తాజా స్పందనపై సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.