RRR: ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయికించిన సినిమాలలో “RRR” ఒకటి. బాహుబలి 2 ద్వారా రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభను ప్రపంచం తెలుసుకునేలా చేశాడు. అనంతరం “RRR” సినిమా చేయటంతో భారీ అంచనాల మధ్య విడుదలయ్యి ఆ రీతిగానే విజయం సాధించింది. సినిమాలో ఎన్టీఆర్ మరియు చరణ్ తమ పాత్రలకు తగిన న్యాయం చేయటం మాత్రమే కాదు … హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల చేత శభాష్ అనిపించుకున్నారు. సినిమాలో టేకింగ్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ దేశాలకు ప్రాంతాలకు అతీతంగా సినిమా లవర్స్ నీ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే బాహుబలి తో జపాన్ లో రాజమౌళికి ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడటం తెలిసిందే.
ఈ కారణంతో అక్టోబర్ 21వ తారీకు జపాన్ దేశంలో “RRR” రిలీజ్ చేయడం జరిగింది. అయితే మొదటి వారంలోనే “RRR”.. జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద 73 మిలియన్లు జపనీస్ యోన్ లు సాధించిన ఇండియన్ ఫిలిం గా రికార్డు క్రియేట్ చేసింది. 44 నగరాలలో 209 స్క్రీన్ లలో సినిమా ప్రదర్శితం అవుతుంది. దీంతో ఓవరాల్ గా జపాన్ దేశంలో “RRR” ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అన్నది సస్పెన్స్ గా నెలకొంది.
జపాన్ దేశంలో సినిమా ప్రేమికులకు భారతీయ చలన చిత్రాలు అంటే ప్రత్యేకమైన అభిమానం. ఈ క్రమంలో జపాన్ దేశంలో అప్పట్లోనే రజినీకాంత్ నటించిన “ముత్తు” సినిమా 400 మిలియన్లు కలెక్షన్లు సాధించి.. ఇప్పటికీ కూడా మొదటి స్థానంలో కొనసాగుతూ ఉంది. “ముత్తు” తర్వాత రెండో స్థానంలో “బాహుబలి 2”.. 300 మిలియన్లు కలెక్షన్ సాధించడం జరిగింది. ఆ తర్వాత “త్రీ ఇడియట్స్” 170 మిలియన్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో మరియు ఓవరాల్ రన్ టైంలో “RRR” ఏ మేరకు కలెక్షన్ కలెక్ట్ చేస్తుందో అన్నది చూడాలి.