RRR: “బాహుబలి”(Bahubali) వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో “RRR” వస్తూ ఉండటంతో సినిమాపై దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఇక ఇదే క్రమంలో బాహుబలి స్థాయిలోనే విజయం సాధించాలని రాజమౌళి RRR సినిమాకి సంబంధించి ప్రతి సన్నివేశం విషయంలో చాలా కేర్ తీసుకోవడం జరిగిందట. ఫస్ట్ టైం ఎన్టీఆర్ చరణ్ కలిసి నటిస్తుండటంతో .. టాలీవుడ్(Rajamouli) ఇండస్ట్రీలో ఇద్దరి పర్ఫామెన్స్ స్క్రీన్ మీద రాజమౌళి ఎలా ప్రెజెంట్ చేశాడు అనేది.. చూడటానికి చాలా ఆసక్తిగా ఉన్నారు.
జనవరి 7వ తారీకు ప్రపంచవ్యాప్తంగా RRR విడుదలకానున్న గ్రామంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో డైరెక్టర్ జక్కన్న హీరోలు చరణ్(Charan), ఎన్టీఆర్(Ntr) బిజీ బిజీగా గడుపుతున్నారు. బాలీవుడ్ రిలీజ్ కి సంబంధించి ముంబైలో RRR ప్రీ రిలీజ్ ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇక ఇదే తరుణంలో ఇటీవల తమిళంలో మరియు మలయాళంలో కూడా సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అక్కడ స్టార్ హీరోలు వచ్చి RRR సినిమా ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొన్నారు. ఇంకో వారంలో థియేటర్లో ప్రదర్శితం కానున్న నేపథ్యంలో తాజాగా RRR సెన్సార్ రివ్యూ బయటకు వచ్చింది. RRR సెన్సార్ కి సంబంధించి ఫారెన్ మరియు ఇండియన్ సెన్సార్ బోర్డు సభ్యులు.. మైండ్ బ్లాక్ రిజల్ట్ ప్రకటించడం జరిగిందట.
రాజమౌళి మరోసారి తిరుగులేని బ్లాక్ బస్టర్ విజయం సాధించడం జరిగిందట. ఇక ఇదే తరుణంలో చరణ్, ఎన్టీఆర్ నటన తెరపై నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు. ఊహించని రీతిలో ఇద్దరూ హవాభావాలు పలికించినట్లు.. సినిమాలో ఫైట్స్ హాలీవుడ్ రేంజ్ నీ తలపించినట్లు.. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. సెన్సార్ రివ్యూ లో బయటపడింది. సినిమా ఫస్టాఫ్ ఓ రేంజ్ లో తీసుకెళ్లి ఇంటర్వెల్ టైం లో.. ప్రేక్షకులను మరింతగా సినిమాలోకి తీసుకెళ్లే విధంగా జక్కన్న కథ నడిపినట్లు.. ఇంటర్వెల్ టైం లో వచ్చే ఫైట్ హైలెట్ గా ఉన్నట్లు.. చెప్పుకొస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే జనవరి 7వ తారీకు తిరుగులేని విజయం RRR సాధించినున్నట్లు సెన్సార్ రివ్యూ రిపోర్ట్. దీంతో RRR సెన్సార్ రివ్యూ రిపోర్ట్ హీరోయిన్లు రావడంతో సినిమాపై అంచనాలు ఇప్పుడు మరింతగా డబుల్ త్రిబుల్ అయ్యాయి.
RRR సెన్సార్ రివ్యూ రిపోర్ట్ మెయిన్ హైలైట్స్..!!
1)రాజమౌళి టేకింగ్.
2)ఎన్టీఆర్, రామ్ చరణ్ పెరఫార్మన్స్.
3)ఇంటర్వెల్ పార్ట్
4)క్లైమాక్స్ హై ఎమోషన్