RRR: మరో 10 రోజుల్లో దేశం ఎంతగానో ఎదురు చూస్తున్న ‘RRR’ చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా మరలా ప్రమోషన్స్ షురూ చేసింది సినిమా యూనిట్. కరోనాతో వాయిదాపడ్డ సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఇక అసలు విషయానికొస్తే, ఈ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ పాట వెనుక పాపులారిటీనే కాదు, ఎన్నో కష్టాలున్నాయి. ఈ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. ఇక ఈ పాట బ్యాగ్రౌండ్లో ఉన్న డాన్సర్స్ అంతా ఉక్రెయిన్ వాసులు కావడం గమనార్హం.
RRR: ఎన్టీఆర్, చరణ్‌ల స్నేహం అబద్దం.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్!
RRR: ‘RRR’ టీమ్ ఎం చెబుతుందంటే?
ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితుల గురించి ‘RRR’ టీమ్ మంగళవారం అనగా ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో తనకు తెలిసిన వ్యక్తులకు ఆర్థిక సహాయం అందజేసానంటూ హీరో రామ్‌చరణ్ చెప్పుకొచ్చారు. ‘‘ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం లేదు. అక్కడ నాకు సెక్యూటిరీగా ఉన్న వ్యక్తితో నేను ఫోన్ ద్వారా టచ్‌లో ఉన్నా. ఇటీవల ఆయనతో మాట్లాడాను. ఆయన 80 ఏళ్ళ తండ్రి గన్ పట్టుకుని యుద్థంలో పాల్గొంటున్నారు అని తెలిసి మనసు ద్రవించింది. అందుకే నా వంతుగా కొంత డబ్బును వాళ్లకు పంపించాను’’ అని రామ్‌చరణ్ చెప్పారు.
RRR: ‘ఎత్తర జెండా’ పాటకు, ఆర్ఆర్ఆర్ మళ్ళీ వాయిదాకు సంబంధం ఏంటీ..?
తారక్ మాట్లాడిన మాటలు:
అలాగే ఈ విషయంపై తారక్ మాట్లాడుతూ… “ఉక్రెయిన్ ప్రజలకు, ముఖ్యంగా డ్యాన్సర్లకు కొత్త విషయం తెలుసుకోవాలనే తపన చాలా ఎక్కువగా ఉంటుంది. వారంతా చాలా ఫ్రెండ్లీ నేచర్ వున్న మనుషులు. అక్కడి డాన్సర్ల గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ‘నాటు నాటు’ సాంగ్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఎంత బాగా చేశారో! వాళ్ళకు కొత్త విషయం తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది’’ అని ఎన్టీఆర్ చెప్పారు.