RRR: అక్కడ ఇక్కడ అనేది లేదు “ఆర్ఆర్ఆర్” విడుదలైన ప్రతి చోటా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రికార్డుల మోత మోగిస్తోంది. సరికొత్త లెక్కలు సెట్ చేస్తోంది. పాత లెక్కలనీ “ఆర్ఆర్ఆర్” అవలీలగా చేరిపేస్తోంది. రాజమౌళి టేకింగ్.. చరణ్, ఎన్టీఆర్ యాక్టింగ్ స్టెప్పులకి… థియేటర్ లు దద్దరిల్లి పోతున్నాయి. విడుదలైన ప్రతి చోట బ్లాక్ బస్టర్ టాక్ రావటంతో సామాన్యుల మొదలుకొని సెలబ్రిటీల వరకు సినిమా చూసి.. రాజమౌళి దర్శకత్వం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
మార్చి 25 వ తారీకు సినిమా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా గా సూపర్ గా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో.. “ఆర్ఆర్ఆర్” కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కు ముందు నుండి ఓవర్సీస్ లో చరణ్ తారక్ అభిమానులు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఎవరికి వారు తమ అభిమానాన్ని చాటుకున్నారు. “ఆర్ఆర్ఆర్” యూఎస్ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా యూఎస్ బాక్సాఫీసు వద్ద 7.5 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు డిస్ట్రిబ్యూటర్లకు.. లాభాలు తెచ్చి పెడుతున్నట్లు సరికొత్త టాక్ నడుస్తోంది.
ఇదే జోరు కొనసాగితే.. ఓవర్సీస్ లో కూడా “ఆర్ఆర్ఆర్” సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకి వస్తున్న కలెక్షన్ల పరంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల కోట్ల రూపాయలు “ఆర్ఆర్ఆర్” కలెక్ట్ చేసే అవకాశం ఉందని.. మరోపక్క టాక్ నడుస్తోంది. పైగా వీకెండ్ కావడంతో పాటు చరణ్ బర్త్ డే సందర్భంగా ఇండియాలో ఆదివారం “ఆర్ఆర్ఆర్” థియేటర్లు హౌస్ ఫుల్ తో నిండిపోయాయి. మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో విదేశాలలో సైతం.. ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.