RRR: వరల్డ్ వైడ్ గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సత్తా చాటిన సినిమాలలో ఎక్కువగా తెలుగు సినిమాల అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ గురించి మాట్లాడుకునే పరిస్థితి నుండి ఇప్పుడు తెలుగు సినిమాలు గురించి మాట్లాడుకుంటున్నారు. అందులోనూ దర్శకుడు రాజమౌళి పనితనం గురించి ప్రపంచ సినిమా రంగం పొగడ్తలతో ముంచెత్తుతోంది. దర్శకుడిగా రాజమౌళికి “బాహుబలి 2” ఎంత పేరు తీసుకొచ్చిందో అంతకంటే డబల్ గా “RRR” పేరు తీసుకొచ్చింది.
కానీ కలెక్షన్ ల పరంగా “బాహుబలి 2” కంటే “RRR” తక్కువగానే సాధించింది. కానీ కరోనా పుణ్యమా ఓటిటిలు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. దీంతో నెట్ ఫ్లిక్స్ లో అంతర్జాతీయ స్థాయిలో విడుదలైన RRR… అనేక రికార్డులు క్రియేట్ చేసింది. నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాగా ఎక్కువ సేపు స్ట్రీమింగ్ అయిన మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇదే సమయంలో ప్రస్తుతం జపాన్ దేశంలో కూడా తక్కువ టైంలోనే అత్యధిక ఎక్కువ వసూలు సాధించిన భారతీయ చిత్రంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తూ విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది.
ఇలాంటి తరుణంలో మరో అంతర్జాతీయ రికార్డ్ “RRR” ఖాతాలో పడింది. విషయంలోకి వెళ్తే సన్ సెట్ సర్కిల్ అవార్డ్స్ 2022లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్..ఫిల్మ్ విభాగంలో నాలుగు అంతర్జాతీయ సినిమాలు పోటీ పడగా…”RRR” అవార్డు కైవసం చేసుకుంది. ఇక ఉత్తమ దర్శకుల విభాగంలో రాజమౌళి రనరప్ గా నిలిచారు. ఉత్తమ ఎడిటింగ్ విభాగంలోనూ “RRR” రనరప్ గా నిలవడం విశేషం. అనేక అవార్డులు రికార్డులు సొంతం చేసుకుంటున్నా “RRR”.. కి ఇంకోపక్క ఆస్కార్ అవార్డు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి రానున్న రోజులో “RRR” ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.