NewsOrbit
న్యూస్ సినిమా

RRR: కౌంట్‌డౌన్ స్టార్ట్..’రామ్ – భీమ్’ల కొత్త పోస్టర్ వదిలిన జక్కన్న టీమ్..

RRR: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. దీనిని తెలుపుతూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను వదిలారు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం ). ప్రముఖ నిర్మాత డివివి దానయ్య దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రం పాన్ ఇండియన్ మూవీగా మార్చ్ 25వ తేదీన విడుదల కానుంది.

rrr-new poster is released by rajamouli team
rrr new poster is released by rajamouli team

ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా సరికొత్త పోస్టర్‌ను వదిలి చిత్రబృందం ప్రకటించింది. రాజమౌళి – రామ్ చరణ్ – ఎన్టీఆర్ లాంటి క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ఇప్పటి నుంచి సరిగ్గా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయం 50 రోజులు. ఈ నేపథ్యంలో మేకర్స్ మళ్ళీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజమౌళి బృందం ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు, కొమురమ్ భీమ్ పాత్రలతో కూడిన కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా వదిలారు.

RRR: ప్రస్తుతం ఈ తాజా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేస్తూ, ఎన్టీఆర్ బుల్లెట్ బండిపై వస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ తాజా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు మెగా, నందమూరి అభిమానులను అలాగే కామన్ ఆడియన్స్‌ను ఈ కొత్త పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్..చరణ్ – తారక్‌ల సరసన హీరోయిన్స్‌గా నటించారు. అలాగే, శ్రియ శరణ్ – అజయ్ దేవగన్ – సముద్ర ఖని సహా పలువు సౌత్ అండ్ హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఇండియాలోనే మొదటి బిగ్గెస్ట్ చిత్రంగా 14 భాషలలో భారీగా విడుదల చేయనున్నారు.

Related posts

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju