“RRR” : బాహుబలి లాంటి అంతర్జాతీయ భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో “RRR” సినిమా రావటంతో ఊహించని రేంజిలో అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్- ఎన్టీఆర్ కలసి మొట్టమొదటిసారి నటించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక సౌత్ లోనే ఈ సినిమా అతి పెద్ద భారీ మల్టీస్టారర్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. స్వాతంత్ర నేపథ్యంలో సాగే స్టోరీ గా సోషియో ఫాంటసీ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా, కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.
అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీనటులు కూడా “RRR”లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన వీడియోలు మరియు ఫోటోలు ప్రేక్షక ఆదరణ దక్కించుకోవడం మాత్రమే కాక సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇలాంటి తరుణంలో “RRR” ప్రి-రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాల కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది అనే టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది.
మేటర్ లోకి వెళ్తే “RRR” ప్రి-రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 245 కోట్లు, కర్ణాటక సంబంధించి 45 కోట్లు, తమిళనాడు 48 కోట్లు, కేరళ 15 కోట్లు, ఉత్తర భారతదేశం 150 కోట్లు, ద మై స్టిక్ మార్కెట్ 500 కోట్లు ఓవర్సీస్ 70 కోట్లు.. టోటల్ థియేట్రికల్ బిజినెస్ 575 కోట్లు సాధించడం మాత్రమేగాక డిజిటల్ రైట్స్ 175 కోట్లు సాధించి శాటిలైట్ హక్కులు 130 కోట్లు తోపాటు మ్యూజిక్ రైట్స్ 20 కోట్లు మొత్తంమీద టోటల్ బిజినెస్ తొమ్మిది వందల కోట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా రాజమౌళి క్రెడిట్ కీ మరియు ఆయన దర్శకత్వ శైలి కి.. బాహుబలి ఇచ్చిన రిజల్ట్ కి “RRR” సృష్టించబోయే ప్రభంజనానికి నిదర్శనమని సినిమా విశ్లేషకులు అంటున్నారు.