RRR: ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్‌కు నిద్ర కూడా పట్టడం లేదు..జరిగిన సంఘటన అలాంటిది మరి

Share

RRR: ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యకు నిద్రపట్టడం లేదట. ప్రస్తుతం ఇదే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా రూపొందిన ఈ పాన్ ఇండియన్ సీమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా 14 బాషల్లో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ప్రీమియర్ షోలకు టిక్కెట్స్ కూడా అమ్మేశారు. నెల రోజుల నుంచి జరిపిన ప్రమోషన్స్ కూడా ఊహకందనంతగా అంచనాలు పెంచాయి. దాంతో నిర్మాత దానయ్య ఆర్ఆర్ఆర్ ద్వారా ఎన్ని వందల కోట్లు మూటగట్టుకుంటాడో అని ప్రచారం జరిగింది.

rrr producer is in tension

కానీ, ఒకే ఒక్క రోజులో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. అప్పటికే మూడుసార్లు పోస్ట్ పోన్ అయిన ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా వేయక తప్పలేదు. కరోనా దెబ్బ నిర్మాత గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తోంది ఇప్పుడు. ఏపీలో టికెట్ రేట్లు తగ్గడం వల్ల రూ 30 కోట్లకు పైగానే నష్టపోయాడని ఓ టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా రిలీజ్ భయం పట్టుకుందట. దానికి తోడు ఉన్నపలంగా ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగిచ్చేయమని ఒత్తిడి చేస్తున్నారట. ఈ సినిమాను మార్చ్ మూడవ వారం లేదా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయానున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

RRR: దానయ్య నోట మాట రావడం లేదని చెప్పుకుంటున్నారట.

కానీ, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన గాని, హింట్స్ గానీ ఏవీ రావడం లేదు. మరోవైపు మళ్ళీ ఈ సినిమాను దసరా పండుగకే రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ నిర్మాత దానయ్యకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయట. ఇంత భారీ బడ్జె సినిమాను మూడేళ్ళకు పైగా భుజాన మోయాలంటే ఏ నిర్మాతకైనా అసాధ్యం. అన్నీ ఓకే అనుకున్న తరుణంలో ఇక నాలుగైదు రోజుల్లో థియేటర్స్‌లో బొమ్మ పడుతుందని ఆశపడిన నిర్మాతకు ఊహించని షాక్ ఇచ్చింది ఒమైక్రాన్. మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. రిలీజ్ డేట్ ప్రకటిస్తే మళ్ళీ ప్రమోషన్స్ నిర్వహిస్తారా లేదా..అంటే దానయ్య నోట మాట రావడం లేదని చెప్పుకుంటున్నారట.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

58 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

5 గంటలు ago