RRR: ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియన్ భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ నిలిచింది. భారతదేశపు బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ ‘ఆర్.ఆర్.ఆర్’ అన్నీ కార్యక్రామలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇక మరికొన్ని గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో అత్యంత భారీ స్థాయిలో 14 ప్రధాన భాషలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అగ్ర నిర్మాత దానయ్య రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
అయితే ఇప్పటికే ఈ మల్టీస్టారర్ మూవీ అన్నీ కలుపుకొని రూ. 900 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయనే చర్చలు ట్రేడ్ వర్గాలలో జోరుగా సాగుతున్నాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, అజయ్ దేవగన్, సముద్ర ఖని, ఓలియా మోరీస్, శ్రియ లాంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. ఇద్దరు పోరాట యోధుల జీవిత కథకు ఫిక్షనల్ డ్రామాను జోడించి తెరకెక్కించారు.
RRR: ఈ రికార్డు బద్దలుకొట్టడానికి ఏ సినిమా వస్తుందో..?
మెగా, నందమూరి అభిమానులు ఇప్పటికే ఈ సినిమా కోసం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే, గత నాలుగేళ్ళుగా రక రకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓవర్సీస్ లో సంచలనమైన రికార్డ్‌ను నమోదు చేస్తూ వచ్చింది. గత నెలలో బుకింగ్స్ ఓపెన్ చేయగా రికార్డు స్థాయిలో ఈ సినిమా ప్రీ సేల్స్ అలాగే, ప్రీమియర్స్ ని నమోదు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు అధికారికంగా ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా కూడా ఆర్ఆర్ఆర్ నిలిచింది. 2.5 మిలియన్ డాలర్స్ ప్రీమియర్స్ తో ఈ సినిమా ఆల్ టైం
ఇండియన్ రికార్డు ని క్రియేట్ చేసింది. ఈ రికార్డు బద్దలుకొట్టడానికి ఏ సినిమా వస్తుందో ఎన్నేళ్లు పడుతుందో అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు