RRR: ఆర్ఆర్ఆర్.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా యూఎస్ ప్రిమియర్స్ లో కూడా సరికొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలవబోతుంది. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శక ధీరుడు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా కోసం గత మూడేళ్లు మన దేశం మొత్తం సినీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు మార్చి 25న భారీ స్థాయిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
కాగా, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తయిపోయాయి కూడా. ఇంకా రిలీజ్ కి సరిగ్గా రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరిగినట్టుగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా యూఎస్ ప్రిమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 1 మిలియన్ క్రాస్ చేయడం ఇప్పుడు అంతటా ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.
RRR: ప్రీమియర్స్ బుకింగ్స్ పరంగా సరికొత్త చరిత్ర
అంతేకాదు ఇది భారతీయ చలన చిత్రాల్లోనే ఈ రేంజ్ లో అది కూడా ఇన్ని వాయిదాలు పడిన సినిమాకు ఇంత స్పీడ్‌గా ప్రీమియర్స్ కోసం టికెట్స్ బుకింగ్ కావడం అనేది మొట్టమొదటి సారి. అందుకే, ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ బుకింగ్స్ పరంగా సరికొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలిచిందని టాలీవుడ్ సినీ వర్గాలు చెప్పుకుంటు న్నాయి. కరోనా వేవ్స్ తరువాత పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ సాధారణ స్థితికి వస్తున్న నేపథ్యంలో మన తెలుగు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ పరంగా సరికొత్త చరిత్రని సృష్టించడం తెలుగు చిత్రపరిశ్రమకు దక్కిన గౌరవంగా అని చెప్పుకుంటున్నారు. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్‌తో పాటు సౌత్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం సినిమాకు పెద్ద ఎస్సెట్ కాబోతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?