RRR: దిగ్గజ దర్శకుడు రాజమౌళి “RRR” సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” వంటి అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ తర్వాత… తన నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సినిమా ఆశిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ -రామ్ చరణ్ ఇద్దరితో కలిపి మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తూ ఉండటంతో… టాలీవుడ్ ఇండస్ట్రీలో అదేవిధంగా దేశవ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు మరియు టీజర్లు కూడా అదరగొట్టే రీతిలో ఉండటంతో ఉండబుద్ధి అంచనాలు పెరిగిపోయాయి.
భారీ తారాగణం అదే రీతిలో విజువల్ ఎఫెక్ట్స్ …కి భారీ బడ్జెట్ కేటాయించడంతో తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులు దేశంలో ఏ సినిమా అమ్ముడుపోనీ రీతిలో … అమ్ముడయ్యాయి అంట. అన్ని భాషల డిజిటల్ హక్కులు జీ5 దాదాపు మూడు వందల అరవై ఐదు కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమాకి మంచి క్రేజ్ ఉండటంతో ఈ రీతిలో రేటు పలికినట్లు… ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న టాక్. పాన్ ఇండియా లెవెల్ లో “RRR” తెరకెక్కడం తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే కాక దేశవ్యాప్తంగా భారీ హిట్ అయినా “బాహుబలి” దర్శకుడు సినిమా అనే మార్కెట్ బయట భారీగా ఉండటంతో ఈ సినిమాకి ఈ రీతిలో డిజిటల్ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం.
వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది జూన్ మాసంలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అప్పట్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సమయంలో ఇద్దరు హీరోలకు గాయాలు కావడంతో పాటు ఎన్టీఆర్ పక్కన నటించడానికి హీరోయిన్ వెతుకులాట కి టైం పట్టడంతో పాటు మహమ్మారి కరోనా ఎంట్రీ తో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ఆలోచన.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?