RRR: రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ నెల 25వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా మీద అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ గా వెలుగుతున్న ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతగా కనిపించబోతోంది. అజయ్ దేవగన్, శ్రీయ శరన్ కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పటికే సాయి మాధవ్ బుర్రా అందించిన డైలాగ్స్ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో జస్ట్ శాంపిల్ చూపించారు. ఇద్దరు హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్స్ అలాగే, థియేట్రికల్ ట్రైలర్ చూసిన అందరూ బాహుబలి సినిమాలను మించిన కొత్త చరిత్ర సృష్ఠించబోతుందని చెప్పుకుంటున్నారు. రాజమౌళి మేకింగ్, చరణ్, తారక్‌ల పర్ఫార్మెన్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఇలాంటి భారీ చిత్రం చూసేందుకు మన ఇండియాలో మాత్రమే కాదు విదేశాలలో కూడా భారీగా పోటీ పడుతున్నారు సినీ ప్రేమికులు. దానికి ఉదాహరణ ఇదే.
RRR: ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ ను క్రాస్ చేసినట్టు తెలుస్తోంది.
సరిగ్గా ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్‌కు రెండు వారాలు మాత్రమే ఉంది. అయితే, ఓవర్సీస్ మార్కెట్ లో ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా ఊహించని స్థాయిలో టికెట్లు అమ్ముడుపోతుండటం విశేషం. వాస్తవంగా గత డిసెంబర్ నెలలో కంటే ఈసారి ఎక్కువగా, జెట్ స్పీడ్‌లో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు కలిసి సినిమా రికార్డు ఫిగర్ 1 మిలియన్ డాలర్స్ మార్క్ దాటే రేంజ్లో ఈ సినిమాకు టికెట్స్ కొనడం ఆసక్తికరంగా మారింది. ప్రీమియర్స్ అలాగే ప్రీ సేల్స్ కలిపి ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ ను ఆర్ఆర్ఆర్ సినిమా క్రాస్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో చరణ్, తారక్ అప్పుడే రికార్డులు మొదలుపెట్టారని అభిమానులు చెప్పుకుంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!