Ntr-Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రాజమౌళి సినిమా కోసం అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన అల్లూరి పోస్టర్ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ లో విడుదల కానుందని దర్శకుడు అధికారిక విడుదల తేదీని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ మే నెలతో పూర్తి కావడంతో ఇటు ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి తదుపరి చిత్రాల పనులను ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బుల్లితెరపై “ఎవరు మీలో కోటీశ్వరుడు” కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.అదేవిధంగా రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది అన్న సమాచారం వినబడుతోంది. ఈ క్రమంలోనే చరణ్ ఒకవైపు ఆచార్య సినిమాలో చేస్తుండగా, శంకర్ దర్శకత్వంలో మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలిసినదే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎంతో బిజీగా గడుపుతున్న ఈ హీరోలకు తాజాగా ఈ సినిమా కొంతమేర డిసప్పాయింట్ కలుగజేసిందని చెప్పవచ్చు.
Ntr-Ramcharan జూన్ నెలలో ఆర్ఆర్ఆర్ షూటింగ్:
ఆర్ఆర్ఆర్ సినిమా మే నెలలో షూటింగ్ పూర్తిచేసుకుని అక్టోబర్ 13న లేదా ఒక వారం అటోఇటో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. మే నెల తర్వాత ఈ సినిమా షూటింగ్ ఉండదని భావించి ఈ హీరోలు వారి మిగతా ప్రాజెక్టులలో చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ షెడ్యూల్ జూన్ నెలలో కూడా 15 రోజులపాటు ఉండునట్లు తెలియడంతో కొంతవరకు వారికి ఇబ్బంది కలిగించినా ఏం చేయలేరు కాబట్టి ఎవరి అడ్జస్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు అనుకున్న విధంగా వరుసగా షూటింగ్ కు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఉంటే ఈ సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల అవుతుందని చిత్ర బృందం తెలియజేసింది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!