`బాహుబలి` సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి చేరింది. ఈ క్రెడిట్ రాజమౌళికే దక్కుతుంది. ఇప్పుడు ఆయన తదుపరి సినిమా `RRR`పై భారీ అంచనాలు ఉన్నాయి. `RRR`లో టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, రాంచరణ్‌లతో పాటు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్, బ్రిటన్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
స్వాతంత్ర్యానికి పూర్వం అంటే.. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రెండు నిజమైన క్యారెక్టర్స్‌కు సంబంధించిన ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజమౌళి చెప్పిన దాని ప్రకారం రాంచరణ్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.. ఎన్టీఆర్ తెలంగాణ కి చెందిన కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్‌ను వడోదర, పూణెల్లో చిత్రీకరించాలనుకున్నారు. అంతా సిద్ధమైన తరుణంలో జిమ్ చేస్తున్న రాంచరణ్‌కు కాలు బెణికింది. మూడు వారాల పాటు రెస్ట్ అవసరం అని డాక్టర్స్ సూచించడంతో .. `RRR` సినిమా షూటింగ్‌ను మూడు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
previous post
next post