RRR – Acharya: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ మొదటి సారి బాగా టెన్షన్ పడుతు న్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం ఆర్ఆర్ఆర్. కొరటాల ప్రముఖ రచయితగ పాపులారిటీ తెచ్చుకొని డార్లింగ్ ప్రభాస్‌తో మిర్చి సినిమా తీసి దర్శకుడిగా మారాడు. ఈ సినిమా భారీ కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది. అంతేకాదు, ప్రభాస్‌ను భారీ కమర్షియల్ హిట్‌ను కూడా ఇచ్చింది మిర్చి సినిమా. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు తో శ్రీమంతుడు, భరత్ అనే నేను, జూనియర్ ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాలు తీశాడు.
ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించాయి. అయితే కొరటాల రూపొందించిన ఈ నాలుగు సినిమాల విడుదల సమయంలో మరో భారీ సినిమా ఏదీ బాక్సాఫీస్ వద్ద పోటీ పడలేదు. కానీ, ఇప్పుడు ఆచార్య సినిమా కంటే నెల రోజులు ముందు వచ్చిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో భారీ హిట్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద అన్నీ భాషలలోనూ ఈ సినిమా కొత్త రికార్డ్స్ నమోదు చేస్తూ మోత మోగిస్తోంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కొమురమ్ భీమ్ గా ఎన్.టి.ఆర్ నటించారు.
RRR – Acharya: అప్పటి వరకు కొరటాలకు టెన్షన్ తప్పదంటున్నారు.
ఈ ఇద్దరికీ రాజమౌళి పాన్ ఇండియన్ స్టార్స్‌గా క్రేజ్ తెచ్చిపెట్టాడు. దాంతో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మెగా మల్టీస్టారర్ మీద ఊహించని విధంగా అంచనాలు ఏర్పడ్డాయి. అదే ఇప్పుడు కొరటాలకు పెద్ద తలనొప్పిగా మారిందట. ఆర్ఆర్ఆర్ తర్వాత అంతే అంచనాలతో రాబోతున్న ఆచార్య సినిమా అందరి అంచనాలను అందుకుంటుందా..! ఈ మూవీతో చిరు – చరణ్‌లకు అభిమానులు ఆశించే రేంజ్లో సక్సెస్ ఇస్తాడా కొరాటాల అని మెగా అభిమానులే కాదు అందరూ మాట్లాడుకుంటున్నారు. దాంతో ఈ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకునే వరకు కొరటాలకు టెన్షన్ తప్పదంటున్నారు.