న్యూస్ సినిమా

హై టెక్నాలజీతో “RRR” సీన్..!!

Share

“బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” సినిమాపై దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అంచనాలు భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం యంగ్ టైగర్ ఎన్టీఆర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి ఈ సినిమా చేస్తున్న నేపథ్యంలో సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ లో అందరి చూపు “RRR” పైన పడింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా అలియా భట్ – ఒలీవియా మోరిస్ లు నటిస్తున్నారు.

Ramaraju Bheem joins hands for 'RRR' climaxకాగా కరోనా వైరస్ తరువాత లాక్ డౌన్ దెబ్బకి మొన్నటి వరకు షూటింగ్ ఆగిపోగా తాజాగా తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమాకి సంబంధించి క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరిస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఈమేరకు ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరు చేతులను కలిపి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసారు. ఇకపోతే ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ స్పెషల్ టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తోంది.

 

ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రేయ, సముద్రఖని ఇంకా చాలా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. డివివి దానయ్య బ్యానర్ లో భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమాగా “RRR” తెరకెక్కుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న క్లైమాక్స్ సీన్ హై టెక్నికల్ కెమెరాలతో సినిమా యూనిట్ చిత్రీకరిస్తున్నట్లు.. విజువలైజేషన్ అదరగొట్టే రీతిలో ఉండే విధంగా రాజమౌళి ప్రతి సన్నివేశం ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉండే రీతిలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ సినిమా తెరకెక్కించడం కోసం చాలా టైం తీసుకోవడంతో ప్రతి సీన్ థియేటర్లో చూసే ప్రేక్షకుడికి గుర్తుండిపోయే విధంగా రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాహుబలి తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని మంచి కసి మీద ఉన్నారట. 


Share

Related posts

రిటైర్ అయినా కూడా కేసిఆర్ కి హెల్ప్ చేసిన నరసింహన్..!!

sekhar

Relationship భర్తలు ఇలా చేస్తే  జీవితం అద్భుతంగా ఉంటుంది!!! (పార్ట్2)

Kumar

రిజర్వేషన్‌లనూ రద్దు చేస్తారేమో?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar