RRR: “ఆర్ఆర్ఆర్” మూవీ భారత చలనచిత్ర రంగం యొక్క స్థాయి పెంచేసింది. దర్శకుడు రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. రాజమౌళి టేకింగ్ కి హాలీవుడ్ సైతం సెల్యూట్ కొడుతోంది. దీంతో ఇప్పటివరకు భారతీయ చలనచిత్ర రంగంలో ఏ దర్శకుడు గురించి రాయని కథనాలు… జక్కన్న గురించి హాలీవుడ్ ప్రముఖ దినపత్రికలలో ప్రచురితమవుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ₹1000 కోట్లు కలెక్ట్ చేయడం తెలిసిందే. “బాహుబలి 2″తో… ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ చేసిన జక్కన్న ఈ సినిమాతో మరోసారి.. వెండి తెర మీద విజువల్ వండర్ చూపించడం జరిగింది.
అంతేకాదు ఇప్పటికే ఆస్కార్ అవార్డు ఎంపికకి కూడా సెలెక్ట్ అవడానికి అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా విజయంతో అంతర్జాతీయంగా పలు చలనచిత్ర ఉత్సవాలకు ఆహ్వానాలు అందుకుంటున్న జక్కన్న… అదే రీతిలో ఇంటర్నేషనల్ అవార్డులు కూడా అందుకుంటున్నాడు. ఇటీవల న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి అవార్డును అందించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డు “RRR” కి వరించింది.
పూర్తి విషయంలోకి వెళ్తే… అట్లాంటా ఫిలిం క్రిటిక్స్ సర్కిల్..ఈ ఏడాదికి గాను బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ అవార్డుకి ఎంపిక చేయటం జరిగింది. ఈ విషయాన్ని జ్యూరీ ట్విట్టర్ వేదికగా తెలియజేయడంతో… “RRR” సినిమా యూనిట్ ధన్యవాదాలు తెలియజేసింది. ఇదే తరహాలో ఆస్కార్ అవార్డు కూడా త్వరగా వస్తే బాగుంటుంది అని… అభిమానులు ఆశిస్తున్నారు. ఇంకా ఇదే సమయంలో రాజమౌళితో వర్క్ చేయడానికి విదేశి నిర్మాణ సంస్థలు భారి ఆఫర్ లు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!