Golden Globe Award’s: ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. గత ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా దాదాపు ₹1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. రాజమౌళికి “బాహుబలి 2” కంటే “RRR” తోనే అంతర్జాతీయంగా మంచి పేరు లభించింది. ఈ సినిమా ఎప్పటికీ మూడు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. కాగా తాజాగా ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా గెలుచుకుంది. పూర్తి విషయంలోకి వెళ్తే లాస్ ఏంజిల్స్ లో 80వ గోల్డెన్ గ్లోబ అవార్డ్స్ వేడుకలు జరిగాయి.
ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల అభిమానాలు అందుకున్న చాలా సినిమాలు ఈ అవార్డు గెలుచుకోవటానికి పలు కేటగిరీలలో పోటీ పడుతూ ఉంటాయి. దీనిలో భాగంగా భారత్ నుంచి మొట్టమొదటిసారి “RRR” సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఇంకా బెస్ట్ ఆన్ ఇంగ్లీష్ ఫిలిం క్యాటగిరి లలో నామినేషన్లలో నిలిచింది. నేనులో భాగంగా “నాటు నాటు” సాంగ్ అవార్డు గెలుచుకుంది. ఈ క్రమంలో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అంతర్జాతీయ వేదికపై గోల్డెన్ గ్లోబ్ ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. కీరవాణికి అవార్డు రావడం పట్ల సినిమా యూనిట్ ఫుల్ ఆనందం వ్యక్తం చేశారు.
దేశంలో గతంలో ఇండియా నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ … కూడా అభినందనలు తెలియజేశారు. నమ్మశక్యం కాని ఒక కొత్త నమూనాన్ని సృష్టించారు. కీరవాణి, రాజమౌళి, “RRR” సినిమా యూనిట్ అందరికీ దేశం తరఫున అభినందనలు అని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇది చారిత్రాత్మక విజయం. కీరవాణికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. “RRR” టీమ్ అందరికీ అభినందనలు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తుంది అని ప్రశంసించారు. ఇంకా చాలామంది ప్రముఖులు సినిమా సెలబ్రిటీలు “RRR” సినిమా యూనిటీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అభినందనలు తెలియజేస్తున్నారు.