నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ వివాహం వేడక ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో పెళ్ళి వేడుకను నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు మెగా,అల్లు వారి కుటుంబాలు హంగామా చేశాయి. ఈ పెళ్ళికి మెగా హీరోలందరు వచ్చారు. వీరు ఆడి,పాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే పెళ్ళి కానుకలు కూడా బాగానే వచ్చాయి. తాము ఎంతో ఇష్టపడే నిహారిక కోసం మెగా హీరోలు బాగానే సమర్పించుకున్నారు. కోట్లల్లో విలువ చేసే బహుమతులను నిహారికకు అందించారు. అయితే మెుత్తం ఎంత అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
మెగా బ్రదర్స్ తమ చెల్లి కోసం విలువైన బహుమతులే ఇచ్చారట!. అలాగే కుటుంబంలోని యువ హీరోలు కూడా నిహారిక భారీ ఇచ్చుకున్నారనేది టాక్. వాటిలో విలువైనా బంగారు నగాలు,డైమాండ్ రింగ్స్ ఉన్నాయట. దాదాపు వాటి 5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఉదయపూర్ అడుగుపెట్టింది మెుదలు పెళ్ళి జరిగే అంత వరకు ప్రతిది హంగామాగానే నిర్వహించారు. పెళ్లి వేడుకను కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులు మొత్తం వేడుకలో పాల్గొన్నారు.
ఇక నిహారిక బుధవారంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో ఏడు అడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకను మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, దగ్గరుండి జరిపించారు. ప్రస్తుతం పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌విలాస్ వేదికగా చైతన్య,నిహారిక జంట ఒక్కటైంది. ఈ వేడుకలో మెగా,అల్లువారి కుటుంబాలు సందడి చేశాయి. మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుక జరగనుంది.