నందమూరి బాలకృష్ణ నటించిన ‘రూలర్’ సినిమా ఈ నెల 20న విడుదలకానున్న విషయం తెలిసిందే. కల్యాణ్ నిర్మాణంలో.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటించారు. అయితే ఈ సినిమా మార్కెట్ అంతగా జరగలేదని టాక్. రూ.15 కోట్ల లోటుతో సినిమాను రిలీజ్ చేస్తున్నారని చెబతున్నారు. బాలయ్య లుక్స్ బాగున్నా… టీజర్, ట్రైలర్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కేవలం బాలయ్యను అభిమానించే నందమూరి ఫ్యాన్స్‌కు మాత్రమే అన్నట్టుగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మెమ్స్.. వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. అవుట్ డేటెడ్ అంటూ విమర్శిస్తున్నారు.
ఒక పక్కన క్రిస్టమస్ సీజన్ ఊరిస్తున్నా.. రూలర్ మార్కెట్ చేసుకోలేకపోతుందని చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజు పండుగే, కార్తీ దొంగ సినిమాలు కూడా అదే సమయంలో విడుదలవుతుండటం కూడా ఓ కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యంగ్ హీరోలకు ఉన్న మార్కెట్ బాలయ్యకు లేదంటున్నారు. ఏది ఎలా ఉన్నా… బాలయ్యకు మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ భారీగానే ఉందని… బాగున్నా.. బాగోకపోయినా చూసే అభిమానులు ఉన్నారంటున్నారు. సినిమా బాగుంటే.. లెజెండ్లా దూసుకెళ్లిపోవడం ఖాయమంటున్నారు.