రీసెంట్గా విడుదలైన `సాహో` సినిమా ఆశించిన మేర ఫలితాలను అందుకోలేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈరోజు సోషల్ మీడియాలో సుజిత్ ఆరోగ్యం వదంతులు వ్యాపించాయి. సుజిత్‌కు ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విష జర్వాలు ఎక్కువగా సోకుతున్నాయి. కాబట్టి ఇది నిజమని అందరూ అనుకున్నారు. అయితే సుజిత్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ వార్తలను ఖండించాయి. సుజిత్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన ఆసుపత్రి పాలయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు.
previous post
next post