బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ తదుపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్లో నిర్మితమవతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటిస్తుంది. ప్రభాస్ పుట్టినరోజున సాహో చాప్టర్ 1ని విడుదల చేసిన చిత్ర యూనిట్ నేడు శ్రద్ధాకపూర్ పుట్టినరోజు సందర్భంగా చాప్టర్ 2ను విడుదల చేసింది. ఇందులో శ్రద్ధాదాస్ గన్ పట్టుకుని యాక్షన్ మోడ్‌లో కనపడుతుంది. అంతే కాకుండా ఈ సినిమాలో యాక్షన్ పార్ట్‌ను ఎలా చిత్రీకరించనే దాన్ని చూపించారు. చివరన ప్రభాస్ న్యూ లుక్లోకనపడి బూమ్ అంటూ డైలాగ్ చెప్పడంతో చాప్టర్ 2 ముగిసింది. ఈ రెండు చాప్టర్స్ చూస్తుంటే సినిమాలో కావాల్సినంత యాక్షన్‌ను ఉందని తెలుస్తుంది. ప్రభాస్ , శ్రద్ధాకపూర్‌తో పాటు మందిరా బేడి, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు నటించారు. సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
previous post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!