సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. జాతకాలు, న్యూమరాలజీపై ఆధారపడి సినిమాల పేర్లు పెడుతుంటారు. నటీనటులు వారి పేర్లను కూడా న్యూమరాలజీ ప్రకారం మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కూడా ఇలాంటి బాటలోనే ఉన్నాడట. ఒకటి.. రెండు కాదు..ఏకంగా ఆరు సినిమాల ప్లాపులు ఎదురు కావడంతో ఏం చేయాలో సాయిధరమ్‌కు దిక్కుతోచలేదు. కాస్త గ్యాప్‌తో కిషోర్ తిరుమల దర్శకత్వంలో `చిత్రలహరి` సినిమా చేశాడు. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. అయితే ప్లాపుల కారణమో.. ఏమో కానీ సాయిదరమ్ తేజ్ తన పేరుని స్క్రీన్‌పై మార్చుకుంటున్నాడట. వివరాల ప్రకారం సాయిధరమ్ తేజ్ తన పేరును సాయి తేజ్‌గా మార్చుకున్నాడట. `చిత్రలహరి`లో కూడా సాయితేజ్ అనే స్క్రీన్ నేమ్ కనపడనుంది.
previous post