32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 2: పవన్ “అన్ స్టాపబుల్” షోలో మరో మెగా హీరో లీక్ అయిన ఫోటోలు..!!

Share

Unstoppable 2: ఆహా “అన్ స్టాపబుల్” టాకీ షో దేశంలోనే అనీ టాకీ షో లలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. హోస్ట్ గా బాలకృష్ణకీ ఈ షో మొదటిది అయినా గాని.. మొదటి ప్రయత్నంలోనే అందరిని ఆకట్టుకోవడం జరిగింది. మొదటి సీజన్ గత ఏడాది ఎంత ఆదరణ పొందిందో దానికి రెండింతలు.. ప్రస్తుతం సెకండ్ సీజన్ ఆదరణ దక్కించుకుంటూ ఉంది. సెకండ్ సీజన్ లో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు వస్తూ ఉన్నారు. దీంతో అన్ని రకాలుగా ఈషో తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తూ ఉంది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఈ షోకి రావడం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో పవన్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ షూటింగ్ జరుపుకోగా… సంక్రాంతి పండుగకు స్ట్రీమింగ్ అవుతుందని పవన్ ఫ్యాన్స్ భావించారు.

sai dharam tej and pawan kalyan unstoppable show pics viral
Saidharam tej in Unstoppable 2 Show

కానీ పండుగ అయినా గాని.. పవన్ ఎపిసోడ్ ప్రసారం కాలేదు. కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కీ సంబంధించి ఆహా టీం పవర్ ఎపిసోడ్ టీజర్ రిలీజ్ చేయడం తెలిసిందే. ఈ టీజర్ పవన్ మరియు నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ లో బాలకృష్ణ… పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మరియు రాజకీయ జీవితం గురించి అనేక ప్రశ్నలు వేశారు. మెగాస్టార్ చిరంజీవి గురించి.. అదేవిధంగా రాజకీయాలలో స్పీచ్ గురించి అనేక ప్రశ్నలు వేయడం జరిగింది. చాలా ఆహ్లాదకరంగా పవన్ కళ్యాణ్ సమాధానాలు ఇచ్చినట్లు టీజర్ లో కనిపించడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ ప్రారంభం కాకముందు పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ కూడా ఈ షోలో పాల్గొన్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా పవన్ తో పాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. పవన్ మరియు బాలయ్యతో పాటు సాయిధరమ్ తేజ్ షోలో పాల్గొన్న ఫోటోలు లీక్ అయ్యాయి.

sai dharam tej and pawan kalyan unstoppable show pics viral
Unstoppable 2

సాయి నల్ల షర్ట్, తెల్ల పంచెతో కనిపిస్తున్నారు. తన కుటుంబ సభ్యుల గురించి పవన్ మాట్లాడుతున్న సమయంలోనే.. సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే సెకండ్ సీజన్ లో చంద్రబాబు మరియు ప్రభాస్ ఎపిసోడ్ లు అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ ఇద్దరి కంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్… అనేక రికార్డులు క్రియేట్ చేస్తుందని మెగా మరియు నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తన మూడు పెళ్లిళ్ల గురించి పొలిటికల్ ప్రత్యర్థులు చేసే విమర్శలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు టాక్. ఇంకా రాజకీయ పొత్తులు గురించి ఈ షోలో పవన్ చేసిన కామెంట్లు రాజకీయంగా ప్రకంపనాలు సృష్టించటం గ్యారెంటీ అని ప్రచారం జరుగుతుంది.


Share

Related posts

Keerthy Suresh: పాపం.. కీర్తి సురేష్ ఏం చేసింద‌ని అంతలా ట్రోల్ చేస్తున్నారు?

kavya N

Pawan Kalyan: అభిమాని దెబ్బ‌కు బెదిరిపోయి కిద్ద ప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్‌!

kavya N

Sharwanand : శర్వానంద్ శ్రీకారం పెద్ద మ్యూజికల్ హిట్ అవుతుందంటూ నమ్మకంగా ఉన్న మేకర్స్..!

GRK