Sai Dharam Tej: మెగా కాంపౌండ్ హీరోలలో ఒకరు సాయి ధరమ్ తేజ్. సుప్రీం హీరోగా ట్యాగ్ లైన్ అందుకున్న ఈ హీరో మొదటి విజయం కోసం అనేక కష్టాలు పడటం జరిగింది. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ్ తన టాలెంట్ తో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. గత ఏడాది రోడ్డు ప్రమాదానికి గురై… ప్రాణాపాయం నుండి తప్పించుకున్న తేజ్ మళ్లీ ఇప్పుడు రికవరీ ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు మొత్తం కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా నటించిన “విరూపక్ష”.. సినిమా ఈనెల 21న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో పాటు సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించడం జరిగింది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్ లు… ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇంకా విడుదల అవటానికి వారం రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఉపందుకున్నాయి. ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ ఇటీవల బిత్తిరి సత్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని ప్రశ్న వేసిన సమయంలో టైం వచ్చినప్పుడు గాని చెప్పడం జరిగింది. ఇంకా సోషల్ మీడియాలో పెళ్లి గురించి వస్తున్న వార్తలు డిస్కషన్ చేసిన క్రమంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..”పెళ్లి అనేది ఖచ్చితంగా నాకు నచ్చినప్పుడు నాకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని తెలిపారు.
ఇంకా ప్రేమ ట్రాక్ లు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్న వేయగా ఆల్రెడీ ఒక బ్రేకప్ జరిగింది. ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత విడిపోవటం కూడా జరిగింది. ఆ తర్వాత అమ్మాయిలు అంటేనే భయం వేసే పరిస్థితి నెలకొంది అంటూ బ్రేకప్ తర్వాత ఇంకా సైలెంట్ అయిపోయాను. అయితే నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. కాబట్టి చాలా సైలెంట్ గా జీవితాన్ని గడుపుతూ వచ్చే కోరికలను అధిగమించుకుంటూ ముందుకు సాగుతున్నాను అంటూ సాయి ధరమ్ తేజ్ ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.