Sai Dharam Tej: మెగాస్టార్ తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరుత సినిమా ద్వారా అడుగు పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్.టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నారు. కాగా నేడు మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో మెగా కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 26 హైదరాబాద్ లో మెగా అభిమానుల సమక్షంలో ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో మెగా హీరోలతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని, స్వామి నాయుడు, యువ హీరో తేజ సజ్జలతోపాటు, బిగ్బాస్ ఫేమ్ దివి తదితరలు పాల్గొన్నారు.
సాయి ధరమ్ తేజ్ చెట్టు-పండు స్టోరీ:
రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ…హైదరాబాద్ వచ్చిన మొదట్లో పెద్ద మామయ్య పుట్టినరోజు విషెస్ చెప్పాలనకున్నాము. కానీ మామయ్య పుట్టినరోజు వేడుకలు ఫాన్స్ మధ్యలో జరుపుకుంటారని చెప్పారు. ఆ ఏడాది తరువాత ఏడాది కూడా మామయ్య తన పుట్టినరోజును అభిమానుల మధ్య జరుపుకున్నారు. మరి ఇన్ని సంవత్సరాలకు ఫాన్స్ మధ్యలో మా బావ చరణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ సాయి ధరమ్ తేజ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఒక కథ చెబుతాను అంటూ.. స్కూల్లో టీచర్ పిల్లలను ఉద్దేశించి అక్కడ ఒక మామిడి పండు ఉంది .ఆ పండు ఎవరు ముందుగా తీసుకొస్తారో వారికే మిగతా మామిడి పండ్లన్ని ఇస్తానని చెప్పడంతో పిల్లలు నువ్వు ముందా నేను ముందా అనుకోకుండా ఒకరికొకరు కలసికట్టుగా వెళ్లి అందరూ కలిసి ఆ మామిడిపండును కోసుకొని వచ్చారు. అదేవిధంగా అందరూ సమానంగా మిగతా మామిడి పండ్లను తీసుకున్నాం ఆ చెట్టు మరెవరో కాదు మా మావయ్య చిరంజీవి గారు, ఆ పిల్లలు మరెవరో కాదు చరణ్, నేను, బన్నీ, శిరీష్, వరుణ్ అంటూ మెగా హీరోల గురించి తెలిపారు. మేమంతా ఆయన పిల్లలమే మాకు మీ సపోర్ట్ ఉంది మీ ప్రేమకు మేమంతా దాసోహమే అంటూ చిరంజీవి గురించి తెలిపారు. ఇక నిర్మాత దిల్ రాజు, దర్శకుడు బుచ్చిబాబు చరణ్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ విధంగా అభిమానుల మధ్య చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!