Sai Dharam Tej: మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపక్ష ఏప్రిల్ 21వ తారీకు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. యాక్సిడెంట్ తర్వాత వస్తున్న సినిమా కావటంతో… అభిమానులు చాలా ఉత్కంఠంగా ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే బైక్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో సాయిధరమ్ తేజ్ మాట స్పష్టత పోయింది. దీంతో డబ్బింగ్ చెప్పిన సమయంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. సాయిధరమ్ తేజ్ కి ప్రాణం పోయే పరిస్థితి నుండి నటుడిగా పునర్జన్మ ఇది. ఇదిలా ఉంటే మామూలుగా ఎటువంటి విషయం అయినా చాలా ఓపెన్ గా సాయిధరమ్ తేజ్ చెప్పేస్తూ ఉంటాడు. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా అందరితో పంచుకుంటూ ఉంటాడు.
దీంతో యాక్సిడెంట్ తర్వాత… తాను ప్రాణంతో బతికి బయటపడటానికి ప్రధాన కారణం హెల్మెట్ అని.. సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ప్రయాణించండి అని చెప్పకు రావటం జరిగింది. ఇంకా జీవితంలో కష్టాలు రావడం సర్వసాధారణం వాటిని దాటుకొని ముందుకెళ్లాలి. ఇంక పెళ్లి విషయం గురించి ప్రశ్న ఎదురైనా సమయంలో చాలా క్లారిటీగా ఇటీవల సాయి ధరంతే సమాధానం ఇచ్చాడు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని మంచి అమ్మాయి కనిపిస్తే తప్పకుండా చేసుకుంటాను అని జవాబు ఇచ్చాడు. అలాగే గతంలో ఓ అమ్మాయితో బ్రేకప్ అయిన విషయం కూడా తెలియజేయడం జరిగింది. తాజా ఇంటర్వ్యూలో… తన క్రష్ గురించి… ఇష్టపడ్డ అమ్మాయిలు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే ప్రతి ఒక్క రియల్ లైఫ్ లో.. ఎవరో ఒకరైన క్రష్ ఉంటారు. నా జీవితంలో ఒకరున్నారు. ఒక నటిగా మనిషిగా అట్రాక్ట్ చేసింది సమంత. రెజీనా, సయామి అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్లు నా ఫస్ట్ హీరోయిన్స్. ఇక నా లవ్ స్టోరీ విషయానికొస్తే ఇంటర్ లో ఉన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయిని ప్రేమించా. మొదట్లో మేమిద్దరం ప్రాణ స్నేహితులం. కానీ ఆ తర్వాత ప్రేమించుకుందాం. కట్ చేస్తే డిగ్రీలో నేనే దగ్గరుండి ఆ అమ్మాయికి పెళ్లి చేశా. ఎందుకంటే అప్పటికి నా దగ్గర డిగ్రీ పట్టా తప్ప ఏమీ లేదు. అందుకే నా ప్రేమను త్యాగం చేశా. ఇక సినిమా ఫీల్డ్ లోకి వచ్చాక. తిక్క సినిమా హీరోయిన్ లారీసా.. బోనేసి చూసి… తొలిచూపులోనే ప్రేమలో పడ్డ. సాంగ్ షూటింగ్ సమయంలో… ప్రపోజ్ చేశా. అయితే అప్పటికే తాను డేటింగ్ లో ఉన్నట్లు చెప్పటంతో నా హార్ట్ బ్రేక్ అయింది. దీంతో.. సోలో బ్రతుకే సో బెటరని ఫిక్స్ అయిపోయా అప్పటినుండి అమ్మాయిలు జోలికి వెళ్ళకుండా సైలెంట్ గా.. నా పని నేను చేసుకుంటూ.. ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పుడు పెళ్లవుతుందని ఫిక్స్ అయిపోయి కామ్ గా ఉన్న.. అని సాయి ధరం తేజ్ చెప్పుకొచ్చారు