Categories: సినిమా

Sai pallavi: సాయి పల్లవి తప్పు చేసిందా? ఆందోళనలో లేడి పవర్ స్టార్ అభిమానులు?

Share

Sai pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రస్తావించాల్సిన పనిలేదు. తాజాగా విరాట పర్వం సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంది. రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ విప్లవాత్మక ప్రేమ కథా చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ, వెన్నెలగా నటించిన సాయి పల్లవికి మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే విరాట పర్వం సినిమా ఇంకా థియేటర్స్ లో ఉండగానే మరో సినిమాతో రిలీజుకి సిద్ధం అవుతోంది. అయితే ఇది స్ట్రైట్ తెలుగు సినిమా కాదు. సాయి పల్లవి రీసెంట్ గా తమిళంలో గార్గి అనే లేడీ ఓరియెంటెడ్ చేసింది. ఈ డబ్బింగ్ మూవీ తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాకి గౌతమ్ రామచంద్ర దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతాన్ని అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. జూలై 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తమిళంలో 2డీ ఎంటర్టైనమెంట్స్ బేనర్ పైన హీరో సూర్య – జ్యోతిక విడుదల చేస్తున్నారు. అలాగే తెలుగు కన్నడ భాషల్లోనూ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే గార్గి రిలీజ్ డేట్ విషయంలో సాయి పల్లవి అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

ఎందుకంటే, ఈ జులై నెలలో చాలా తెలుగు సినిమాలు రిలీజు కానున్నాయి. జూలై 14 అంటే గార్గి విడుదలకు ఒక్కరోజు ముందు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కృతి శెట్టి జంటగా ఎన్. లింగుసామి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ది వారియర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ద్విభాషా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే జూలై 21న కార్తికేయ 2, జూలై 22న థ్యాంక్యూ, జూలై 28న హిట్ 2, జూలై 29న రామారావు ఆన్ డ్యూటీ వంటి బడా సినిమాలు రిలీజు కాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో సాయి పల్లవి సినిమా రిలీజు అంటే మరి లేడీ పవర్ స్టార్ అభిమానులకు కాస్త టెన్షన్ ఉంటుంది మరి!


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

1 hour ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

3 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

4 hours ago