Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ అమ్మాయి అయినా గాని మలయాళం “ప్రేమం” సినిమాతో అందరి చూపు తన వైపు తిప్పేలా చేసింది. ఈ సినిమాలో కాలేజీ లెక్చరర్ పాత్రలో సాయి పల్లవి ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన “ఫిదా” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నటనపరంగా ఇంక డాన్స్ పరంగా సాయిపల్లవి సౌత్ లోనే తిరుగులేని హీరోయిన్ అనిపించుకుంది.
ఒక విధంగా చెప్పాలంటే డాన్స్ పరంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే.. సాయి పల్లవి పర్ఫామెన్స్ కి పోటీ హీరోయిన్ లేదని చెప్పవచ్చు. సౌత్ లో అనేక అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనే అని అనుకున్న పాత్రలో సాయి పల్లవికి అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
పూర్తి విషయంలోకి వెళ్తే హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న ఓ మూవీలో.. సాయి పల్లవి నటించనుందట. రణబీర్ శ్రీరాముడి పాత్రలో… సాయి పల్లవి సీత పాత్రలో… కనిపించనున్నట్లు సమాచారం. మొదట ఈ పాత్ర కోసం దీపికా పదుకొనే, కరీనాకపూర్ పేరులు వినిపించాయి. కానీ దర్శక నిర్మాతలు సాయి పల్లవిని కన్ఫామ్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ వార్త అధికారికంగా ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రావణుడి పాత్రలో హృతిక్ రోషన్ కనిపించనున్నారట. కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా చేయనున్నట్లు.. వార్తలొస్తున్నాయి.