Pushpa 2: 2021 డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” ఊహించని విజయం సాధించడం తెలిసిందే. ఈ సినిమా తీసిన దర్శకుడు సుకుమార్ కే… “పుష్ప” కలెక్షన్స్ వారం రోజులుగా నాన్ స్టాప్ గా ఓపెనింగ్ సలహాలు రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా… ప్రపంచ సినిమా రంగంలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. “పుష్ప”తో ఒక్కసారిగా బన్నీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అది కూడా దేశంలోనే మాత్రమే కాక విదేశాలలో సైతం.. బన్నీకి “పుష్ప” మంచి మార్కెట్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా రాకముందు వరకు కేవలం దక్షిణాది సినిమా రంగంలో అది కూడా తెలుగు మరియు మలయాళం ఇండస్ట్రీలలో బన్నీకి మార్కెట్ ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ క్రియేట్ అయింది. తగ్గేదేలే.. డైలాగ్ బన్నీ తలరాత మార్చేసింది. దీంతో ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ విషయంలో ఎక్కడా తగ్గటం లేదు. సంక్రాంతి పండుగకు మొదలైన షూటింగ్ నాన్ స్టాప్ గా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలకపాత్రలో హీరోయిన్ సాయి పల్లవిని సుకుమార్ తీసుకోబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
మామూలుగానే సాయి పల్లవి అంటే సుకుమార్ కీ చాలా ప్రత్యేకమైన అభిమానం. అయితే ఈ సినిమా మూడో భాగం కంటిన్యూ అయ్యే తరహాలో కొత్తగా… స్క్రిప్టులో సాయి పల్లవికి పాత్ర రాసినట్లు.. సెకండ్ పార్ట్ ఆశించిన విజయం సాధిస్తే.. మూడో భాగంలో సాయి పల్లవి కీలక పాత్ర పోషించేలా సుకుమార్ డిజైన్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం మరియు హైదరాబాద్ లో రెండు షెడ్యూలు జరుపుకోవాలని త్వరలో బ్యాంకాక్ లో మూడో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారట. ఏప్రిల్ 8 వ తారీకు బన్నీ పుట్టినరోజు నేపథ్యంలో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.