Sai Pallavi: ఒకప్పుడు ఐటెం సాంగ్స్ చేసేందుకు స్పెషల్‌గా నటీమణులు ఉండేవారు. కానీ, ప్రస్తుత రోజుల్లో హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్స్ చేసేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. మొన్నామధ్య సమంత సైతం `పుష్ప`లో `ఊ అంటావా మామ` అనే ఐటెం సాంగ్‌తో ఓ ఊపు ఊపేసింది.
అలాగే పూజా హెగ్డే, తమన్నా, కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్, పాయల్ రాజ్‌పుత్ వంటి వారు సైతం ఐటెం సాంగ్స్‌లో మెరిశారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి `ఐటెం సాంగ్స్ లో అవకాశం వస్తే నటిస్తారా?` అనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంతకీ సాయి పల్లవి ఏం చెప్పిందంటే..`ఐటెం సాంగ్స్‌లో అవకాశం వస్తే ఖచ్చింగా నో చెప్పేస్తా.. తనకు అటువంటి సాంగ్స్ కంఫర్ట్ గా ఉండవు. పైగా వస్త్రధారణ సరిగా లేకపోతే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఐటెం సాంగ్స్‌లో ఛాన్సులు వచ్చినా నిర్మొహమాటంగా చేయనని చెప్పేస్తా. నాకసలు అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా లేదు` అని చెప్పుకొచ్చింది. దాంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా, సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి.. తర్వలోనే `విరాట పర్వం`తో ప్రేక్షకులను పలకరించబోతోంది. అలాగే ఈ మధ్య `గార్గి` అనే మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది. వీటితో పాటు తమిళంలో శివకార్తికేయన్‌కు జోడీగా ఓ మూవీకి సైన్ చేసింది. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం.
Summary in English: Sai Pallavi’s reaction on the question of doing item song in Telugu movies
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…