Rana-Sai Pallavi: రానా దగ్గుబాటి, సాయి పల్లవి తొలిసారి జంటగా నటించిన చిత్రం `విరాట పర్వం`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ప్రియమణి, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అనేక అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. నక్సలిజం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమ కథ ఇది. ఇటీవలె బయటకు వచ్చిన ట్రైలర్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది.
ఇక ప్రస్తుతం మేకర్స్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. అలాగే రానా వ్యక్తిత్వం ఎలాంటిదో నిర్మొహమాటంగా బయటపెట్టేసింది.
సాయి పల్లవి మాట్లాడుతూ.. `రానా డౌన్ టూ ఎర్త్ పర్సన్. మొన్న కర్నూలులో జరిగిన ట్రైలర్ ఈవెంట్‌లో వర్షం పడుతుంటే ఆయన నాకు గొడుగు పట్టుకోవడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. తన రియల్ క్యారెక్టర్ అలానే ఉంటుంది. హీరో ఇమేజ్‌ని ఆయన ఎప్పుడూ పట్టించుకోరు. సెట్ లో కూడా నాకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. షూటింగ్ ఉన్నప్పుడు నేను సేఫ్‌గా ఇంటికి వెళ్లేంత వరకు కేర్ తీసుకునేవారు. ఆయనది చాలా గొప్ప వ్యక్తిత్వం` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారియి.
Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…