NTR Sai Pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్స్ పరంగా ఎన్టీఆర్ తిరుగులేని హీరో అని అందరికీ తెలుసు. ఎటువంటి కష్టతరం స్టెప్ అయినా చాలా అలవోకగా వేస్తారు . పైగా ఏటువంటి రిహార్సల్ చేయకుండానే చూసి మరి ఒకే ఒక టేక్ తో తారక్ ఓకే చేస్తాడని చాలామంది స్టార్ కొరియోగ్రాఫర్ లు చెబుతారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన కెరియర్ లో 30వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని తారక్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా హిట్ పడాలని .. స్టోరీ అన్ని రకాలుగా జాగ్రత్త పడుతున్నారు.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో స్టార్టింగ్ లో ఎన్టీఆర్ సరసన ఆలియాభట్ హీరోయిన్ అనే టాక్ బలంగా వినిపించింది. అయితే ఆలియా కి ఇటీవల పెళ్లి కావటంతో ఆమెను పక్కన పెట్టి రష్మిక మందన నీ తెరపైకి తీసుకొచ్చినట్లూ వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి నీ తీసుకునే ఆలోచనలో కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
“శ్యామ్ సింగరాయ్” తర్వాత సాయి పల్లవి ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. ఈ క్రమంలో కొరటాల శివ సినిమా చేసే ఆలోచనలో సాయిపల్లవి ఉన్నట్టు టాక్. ఒకవేళ ఓకే అయితే ఇద్దరికిద్దరు డాన్స్ పరంగా ఇరగదీస్తారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు భారతదేశంలో ఉన్న హీరోయిన్ అందరిలో సాయి పల్లవి గ్రేట్ అండ్ స్పీడ్ డాన్సర్. తారక్ గురించి చెప్పక్కర్లేదు. ఇద్దరికీ సరైన పాటలు మూవీలో రెండు మూడు పడాయి అంటే.. దానికి తగ్గట్టే ఇద్దరూ పోటీపడి డాన్స్ వేశారు అంటే.. కథ పరంగా కాదు పాటల పరంగా సినిమా తిరుగులేని విజయం సాధించడం ఖాయం అని అంటున్నారు. మరి కొరటాల శివ- తారక్ ప్రాజెక్టులో సాయి పల్లవి ఓకే అవుతుందో లేదో చూడాలి.