32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Sai Pallavi: సాయిపల్లవికి ఫిదా అయినా అజిత్ కుమార్, సినిమాలకు దూరం అయిందనుకుంటే మరో భారీ తమిళ ప్రాజెక్టుకి ఓకే చెప్పిన మలార్ సుందరి

Sai Pallavi roped in for a New Tamil Movie with Ajith Kumar
Share

Sai Pallavi: సాయిపల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తది. ఎంతకంటే.. గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా వెనకాడని హీరోయిన్లు ఉన్న ఈ రోజుల్లో.. తనకంటూ ప్రత్యేకమైన ట్రెడిషనల్‌ లుక్, గౌరవాన్ని దక్కించుకుంది. గ్లామర్ పాత్రలు చేస్తేనే సినిమా అవకాశాలు వస్తాయన్న నానుడిని బ్రేక్ చేస్తూ.. యాక్టింగ్, క్యూట్‌నెస్, అందంతోనే ఆఫర్లు సంపాదించుకుంటోంది. ఆమె నటించిన చాలా వరకు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. టాలీవుడ్‌లో ‘ఫిదా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. పల్లెటూరి పడుచు పిల్ల పాత్రలో నటించి అందరీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. లీడ్ రోల్స్ లో నటిస్తూ.. లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది.

Sai Pallavi roped in for a New Tamil Movie with Ajith Kumar
Sai Pallavi roped in for a New Tamil Movie with Ajith Kumar

టాలీవుడ్‌లో ఇప్పటివరకు సాయిపల్లవి.. ‘ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడిపడి లేచే మనసు, ఎన్‌జీకే, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి’ వంటి సినిమాల్లో నటించింది. అన్నీ సినిమాలూ మంచి హిట్ అందుకున్నాయి. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం భాషల సినిమాల్లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే, ఈ మధ్యకాలంలో సాయిపల్లవి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఈ క్రమంలో చాలా మంది సాయిపల్లవి సినిమాలు మానేసిందనే అనుకున్నారు. మెడిసిన్ పూర్తి చేసుకున్న సాయిపల్లవి డాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ, సాయి పల్లవి మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.

Sai Pallavi: లైకా ప్రొడక్షన్స్ లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది

సినిమా కథ విషయంలో సాయి పల్లవి ఎంతో జాగ్రత్త వహిస్తారు. తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకు తగ్గట్లుగానే కెరీర్ ప్లాన్ చేసుకుంటారు. సినిమాతో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పుడే సినిమాలు చేస్తుంది. అంతే కానీ డబ్బుల కోసం ప్రతీ సినిమా చేయడం సాయి పల్లవికి నచ్చదు. ఈ క్రమంలోనే సాయి పల్లవికి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి తెలిసిందే. సాయిపల్లవి మాదిరిగానే ఈ స్టార్ హీరోల సినిమాలు కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన నటించిన చాలా వరకు సినిమాల్లో హీరోయిన్ల పాత్రకు మంచి స్కోప్ ఉంటుంది. అజిత్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవికి ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

Adah Sharma: అల్లు అర్జున్ యాక్ట్రెస్ అదా శర్మ అరాచకం.. అర్ధ నగ్న అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్న సుందరి!

అజిత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తునివు’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజ్ అయింది. టాలీవుడ్‌లోనూ ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. అయితే అజిత్ తర్వాతి సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తారని సమాచారం అందుతోంది. లైకా ప్రొడక్షన్స్ లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ విషయంలో ఇప్పటికే చాలా మంది నటీమణుల పేర్లు వినిపించాయి. కానీ వారెవరూ ఆ పాత్రకు సెట్ కాలేదని టాక్. ఈ క్రమంలో సాయి పల్లవి పేరు వినిపించిందట. ఈ సినిమాకు సాయి పల్లవి హీరోయిన్‌గా ఉంటే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. చివరకి సాయిపల్లవినే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. అజిత్-సాయిపల్లవి క్రేజీ కాంబినేషన్ అవుతుందని, సాయి పల్లవి జాతకమే మారిపోతుందని పలువురు అభిమానులు చెబుతున్నారు.

 


Share

Related posts

Salaar : సలార్‌లో శృతి హాసన్ క్యారెక్టర్ మీద ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..!

GRK

Shivani Narayanan Cute Photos

Gallery Desk

Nithya Menen: మెట్ల‌పై నుంచి ప‌డిపోయిన నిత్యా మీన‌న్‌.. నడవలేని స్థితిలో హీరోయిన్‌!

kavya N