సినిమా

Sai Pallavi: ఊపందుకున్న‌ పెళ్లి వార్త‌లు.. ఒక్క ఫొటోతో సస్పెన్స్ లో ప‌డేసిన‌ సాయి పల్లవి!

Share

Sai Pallavi: అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకున్న హీరోయిన్స్‌లో సాయి ప‌ల్ల‌వి ఒక‌రు. `ప్రేమమ్` అనే మ‌ల‌యాళ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఫిదా` తో గ్రాండ్‌గా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

అయితే ఏమైందో ఏమో గానీ.. గ‌త కొద్ది రోజుల నుంచీ సాయి ప‌ల్ల‌వి ఎట‌వంటి కొత్త ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేయ‌లేదు. ల‌వ్ స్టోరీ, శ్యామ్ సింగ‌రాయ్ వంటి భారీ హిట్స్ ప‌డినా సాయి ప‌ల్ల‌వి సైలెంట్‌గానే ఉంది. దీంతో సాయి ప‌ల్ల‌వి పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ని, అందుకు కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ టేక‌ప్ చేయ‌డం లేదంటూ వార్త‌లు ఊపందుకున్నాయి.

Baseless Rumors on Actress Sai Pallavi

గ‌త మూడు రోజుల నుంచీ సాయి ప‌ల్ల‌వి పెళ్లి వార్తే నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇలాంటి త‌రుణంలో సాయి ప‌ల్ల‌వి ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసిన ఒక ఫొటో అంద‌రినీ స‌స్పెన్స్‌లోకి నెట్టేసింది. ఈ ఫొటోలో చీర కట్టుకున్న ఓ పల్లెటూరి యువతి బ్యాగు వేసుకుని ఫేస్ చూపించ‌కుండా పరిగెడుతూ క‌నిపిస్తోంది.

అలాగే ఈ పిక్‌పై `చాలాకాలంగా ఆమె ఒక సర్‌ప్రైజ్‌ను దాస్తోంది. నాకు తెలిసి ఈ సోమవారం అంటే మే 9న ఆమె మిమ్మల్ని చూడటానికి సిద్ధమైందనుకుంటున్నాను` అని సాయి ప‌ల్ల‌వి పేర్కొంది. దాంతో అస‌లేంటా ఫొటో..? సాయి ప‌ల్ల‌వి కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన పిక్‌కా..? లేక మ‌రేదైనానా? అంటూ ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. మ‌రి దీనిపై క్లారిటీ రావాలంటే రేప‌టి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.


Share

Related posts

Devatha Serial: నేనేమైనా నీ కన్న బిడ్డనా.!? సత్య హాస్పిటల్ కి వెళ్దామంటే రాధ ఏమంది.!?

bharani jella

వైరల్ ఫోటో.. పొలం పనులు చేస్తున్న బిగ్ బాస్ దివి..!

Teja

Hero Siddharth vs BJP: నేను ఆగేది లేదు – బీజేపీ భరతం పడతా..! మోడీ, అమిత్ షాపై తమిళ హీరో భగ్గు..!!

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar