సినిమా

Sai Pallavi: సూప‌ర్ న్యూస్ చెప్పిన సాయి ప‌ల్ల‌వి.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్!

Share

Sai Pallavi: ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ల‌వ్ స్టోరీ, శ్యామ్ సింగ‌రాయ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్న ఈ అందాల భామ‌.. త్వ‌ర‌లోనే `విరాట పర్వం`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనేక వాయిదాల అనంత‌రం జూలై 1న విడుద‌ల కాబోతోంది.

అయితే ఇదే సాయి ప‌ల్ల‌వి ఆఖ‌రి సినిమా అని.. త్వ‌ర‌లోనే ఆమె పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. సాయి ప‌ల్ల‌వి నుంచి ఎటువంటి కొత్త సినిమాల ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో ఈ వార్త‌లు ఊపందుకున్నాయి. అయితే నేడు సాయి ప‌ల్ల‌వి బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన సూప‌ర్ న్యూస్‌ను అంద‌రితోనూ పంచుకుంది.

ఇంత‌కీ ఈ న్యూస్ ఏంటంటే.. సాయి ప‌ల్ల‌వి గౌతం రామచంద్రన్‌ దర్శకత్వంలో `గార్గి` అనే మూవీలో చేస్తోంది. బ్లాకీ జనీ బ్యానర్ పై రవి చంద్రన్, ఐశ్వర్య లక్ష్మీ, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం సమకూరుస్తున్నారు. నేడు ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు మేకింగ్ వీడియో గ్లిమ్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ తెలుగుతోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయ‌నున్నాట్లు మేక‌ర్స్ స్ప‌ష్టం చేశారు. మొత్తానికి సాయి ప‌ల్ల‌వి నుంచి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రావ‌డంతో.. ఆమె ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అలాగే మ‌రోవైపు నెట్టింట ట్రెండ్ అవుతున్న పెళ్లి పుకార్త‌ల‌కు చెక్ ప‌డింది.


Share

Related posts

‘పిల్లలే దేవుళ్లు.. చేతిలో గన్స్..’ ఏజెంట్ ఆత్రేయ దర్శకుడి మరో ప్రయోగం..

Muraliak

బిగ్ బాస్ 4 : నాగార్జున ఇలా బుక్ అయ్యాడేంటి..? అతను చూపించిన ఆ తేడాకి తిట్టిపోస్తున్నారుగా

arun kanna

సీనయ్యకు జోడీ కుదిరింది

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar