సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో పద్ధతిగా సినిమాలు చేసే అతి తక్కువ మంది హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉండేది సాయి పల్లవి. నటన పరంగా డాన్స్ పరంగా సాయి పల్లవికి మించిన హీరోయిన్ లేరని చెప్పవచ్చు. సాయి పల్లవి తో పోటీగా డాన్స్ చేసే హీరోలు కూడా ఎక్కువ ఉండాలని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏక్కడ కూడా గ్లామర్ షోలకు ప్రాధాన్యత ఇవ్వకుండా..చాలా హోమ్లీ పాత్రలు చేస్తూ.. తిరుగులేని క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజింగ్ కి తాను చాలా దూరంగా ఉంటారని సాయి పల్లవి చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఐటెం సాంగ్ లు చేయను అని తెలిపింది.
ఇదిలా ఉంటే ఇటీవల ప్రముఖ దర్శకుడు లేడీ ఓరియంటెడ్ సినిమా స్టోరీ సాయి పల్లవి చెప్పడం జరిగింది. చాలా పవర్ఫుల్ పాత్ర అని ఇందుకోసం 40 రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుందని ఎందుకు గాను రెండున్నర కోట్లు రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే స్టోరీ మొత్తం విని ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేయడం.. ఇష్టం లేదు అని మొహం మీదే సదరు దర్శకుడు కి సాయి పల్లవి చెప్పడం జరిగిందంట.
మరింత ఎక్కువ రెమ్యున్ రేషన్ ఆఫర్ చేసిన గాని.. స్టోరీలో క్యారెక్టర్ కి నాకు అంత సూట్ కాదు.. ఎంత ఇచ్చిన చేయను అని సాయి పల్లవి చెప్పినట్లు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. ఏదో ఒకటే మాత్రమే కాదు ఒక యాడ్ మరియు తమిళ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ప్రాజెక్టు కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా పాత్రలో వస్త్రధారణ కరెక్ట్ గా ఉండే రీతిలో ఏ మాత్రం.. ఎక్స్పోజింగ్ కి తావు లేకుండా.. సినిమాలా సెలక్షన్ లో కూడా చాలా జాగ్రత్తలు ఈ ముద్దుగుమ్మ తీసుకోవడం విశేషం.