Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి అందరికి సుపరిచితురాలే. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరిలో ఎవరు వెయ్యని రీతిలో ఈ ముద్దుగుమ్మ స్టెప్పులు ఉంటాయి. స్వతహాగా తమిళ అమ్మాయి అయినా గాని తెలుగులో సాయి పల్లవి తిరుగులేని క్రేజ్ ఉంది. స్టార్టింగ్ మలయాళంలో “ప్రేమమ్” సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సినిమాతోనే తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “ఫిదా” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి… మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చేరగని ముద్ర వేసుకుంది. ఈ సినిమా తర్వాత వరుస పెట్టి అవకాశాలు అందుకుంది.
అయితే తాను నటించే సినిమాలలో మేకప్ వేసుకోకపోవడానికి గల కారణాన్ని… సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ముంబైలో ఓ ఈవెంట్ లో పాల్గొని మేకప్ లేకుండా నటించడానికి గల ప్రధాన కారణం గురించి మాట్లాడుతూ..”సినిమా ఎంట్రీ సమయంలో స్వరం విషయంలో చాలా అభద్రతాభావంతో ఉండేదనీ. ముఖ్యంగా ముఖంపై మొటిమలు విషయం నన్ను ఎంతగానో భయపడేటట్టు చేసేది. దీంతో ఆత్మస్థైర్యం కోసం ఫస్ట్ సినిమా “ప్రేమమ్” లో ఎక్కడా కూడా మేకప్ లేకుండా ధైర్యంగా నటించేసాను.
ప్రేక్షకులు నన్ను అద్భుతంగా స్వీకరించారు. దీంతో నాలో ఉన్న ఆత్మస్థైర్యం మరింత రెట్టింపు అయింది. ఇక చేసే సినిమాలలో మేకప్ లేకుండా నటించడం అలవాటైందని.. మొటిమలు గురించి పెద్దగా పట్టించుకోవటం మానేశానని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. అదిరిపోయే స్టెప్ లు వేసే సాయి పల్లవి… ఎక్కడ కూడా కమర్షియల్ కి ప్రాధాన్యత ఇచ్చి నైతిక విలువలను పక్కన పెట్టలేదు. అదే సమయంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతిగా గ్లామర్ డ్రస్సులతో కూడా తాను నటించే ప్రసక్తి లేదని కరాకండిగా చెప్పిన ఏకైక హీరోయిన్.