మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి..!

పవన్ కల్యాణ్ సిానిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగే.. జనంలో ఆయనకు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌సరం లేదు. ఆయ‌న సినిమాని మొద‌టిరోజు.. మొద‌టి షో చూడాల‌ని అభిమానులు ఎంతో ఆశ‌ప‌డుతుంటారు. అలాంటి ఆయ‌న‌తో సినిమాలు తియ‌డానికి డైరెక్ట‌ర్లు పోటీ ప‌డుతుంటారు. ఇక యాక్ట‌ర్ల గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు క‌దా..

ఈ అవ‌కాశాన్ని హీరోయిన్ సాయిపల్లవి, హీరో నితిన్ కొట్టేశార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చేబుతున్నాయి. పవన్‌ కల్యాణ్ హీరోగా న‌టిస్తున్న సినిమాలో ల‌క్కీ ఛాన్స్ కొట్టేశార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దాంతో అటు నితీన్ అభిమానులు, ఇటు సాయిప‌ల్ల‌వి ఫ్యాన్స్ ఆనందంతో కేక‌లు వేస్తున్నార‌ని టాక్. సినిమా బంప‌ర్ హిట్ అంటూ అప్పుడే గుస‌గుస‌ల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తెలుగు సినిమా అభిమాన పోలీస్‌ ఈజ్‌ బ్యాక్‌ ఇన్‌ ఏ హై ఓల్టేజ్‌ రోల్ అని చెబుతూ పవన్ ‌కల్యాణ్ త‌న కొత్త ప్రాజెక్ట్ గురించి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అభిమానులతో ఒక స్పెష‌ల్ వీడియోని పంచుకున్న విషయం అంద‌రికీ తెలిసిందే.

మలయాళంలో గొప్ప‌ విజయాన్ని సాధించిన‌ అయ్యప్పన్‌ కొషియమ్ కు ఈ సినిమా రీమేక్ గా వ‌స్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే ఈ సినిమాకి బిల్లా రంగా అనే పేరును కూడా పెట్టేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇగ‌ మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్ యాక్ట్ చేసిన‌ పాత్రను రానా న‌టిస్తున్నాడ‌ని పుకార్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ పాత్రలో నితిన్‌ నటించే అవకాశాలు ఉన్నాయని స‌మాచారం. ఇందులో కూడా సాయిపల్లవి నటించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పటికే ఆ సినిమా యూనిట్ ఆమెను సంప్రదించినట్లు స‌మాచారం. విటిల్లో నిజం ఎంత అనేది తెలియాలి అంటే వాళ్లు చెప్పేదాక వెయిట్ చేయాల్సిందే.