Sai Pallavi: “విరాట పర్వం” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కాశ్మీర్ పండిట్ ల పై దాడి.. ఆవులను తరలిస్తున్న వ్యక్తుల హత్యలు గురించి సాయి పల్లవి చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ గా మారిన సంగతి తెలిసిందే. ఏకంగా కొంతమంది సాయి పల్లవి పై పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలకు కొంత మంది మద్దతు నిలవగా మరికొంతమంది ప్రతి విమర్శలు చేశారు. దీంతో ఉన్న కొద్ది.. వివాదం పెరుగుతూ ఉండటంతో.. సాయి పల్లవి సోషల్ మీడియాలో లైవ్ లో వివరణ ఇచ్చారు. ఫస్ట్ టైం సాయి పల్లవి లైఫ్ లోకి రావడంతో.. చాలామంది ఈ వీడియో చూడటం జరిగింది. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలలో కొన్నిటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని.. అనవసరమైన రాద్ధాంతం చేస్తూ తప్పుడు ప్రచారం చేశారని పేర్కొంది.
మీరు రైట్ వింగ్ కి సపోర్ట్ ఇస్తారా..? లెఫ్ట్ వింగ్ కి సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తే ముందు మనం మంచి మనుషులుగా జీవించాలని ఉద్దేశమే అన్న భావనతో సమాధానం ఇవ్వటం జరిగిందని సాయి పల్లవి తెలిపింది. కానీ తాను చేసిన కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకునే ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. హింస ఎటువంటి రూపంలో ఉన్న దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని తెలిపింది. నేను మొదట ఓ డాక్టర్.. కాబట్టి ప్రాణం విలువ తెలుసు. ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని స్పష్టం చేసింది.
ఏదిఏమైనా తాను చేసిన కామెంట్లు పట్ల ఎవరైనా బాధపడి ఉంటే అందుకు క్షమాపణ కోరుతున్నట్లు చెప్పుకొచ్చింది. గత కొన్ని రోజులుగా తన పై మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు పట్ల స్పందించడానికి చాలా ఆలోచించాల్సి.. వచ్చిందని పేర్కొంది. తన మాటలను ఎవరిని భాదించకూడదు అన్న ఉద్దేశంతోనే వివరణ ఇచ్చినట్లు సాయి పల్లవి స్పష్టం చేసింది. ఈ క్రమంలో తనపై చాలామంది నెగిటివ్ ప్రచారం చేస్తున్న సమయంలో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని సాయి పల్లవి వీడియో ముగించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…